6, అక్టోబర్ 2016, గురువారం

చక్రమేది శంఖమేదిచక్రమేది శంఖమేది చాపమొకటె చేపట్టి
విక్రమించి రాక్షసుల పిండిపిండి చేసితివి

హరిని వధింతునని యన్నిట గ్రుమ్మరి
పరమాత్మా మిక్కిలి భంగపడి
సురలను మునులను పరిభవించి తుదకు
నరుడవై నీవురా విరిగె నా రావణుడు
శంఖమేది

పదితలలుండు గాక పంచాయుధము లేల
వదలిన పదునైన బాణములు
ముదిరిన వాని పీడ వదిలించగా నీవు
ముదితులై రెల్ల లోకములలోని జనులు
చక్రమేది

నరులను వానరులను నవ్వి చులకన చేసె
నరుడగ నీవురా నాడెఱిగె
నరునిగ వచ్చిన వాడు హరియన్న సత్యము
నరుడనే నేనని నమ్మిన రామయ్య
చక్రమేది