15, అక్టోబర్ 2016, శనివారం

గోపగోపీజనసంతోషరూప గోపబాల



గోపగోపీజనసంతోషరూప గోపబాల
పాపకదళీవనకుఠారరూప గోపబాల

నారదాదిసుజనహృద్విహారి గోపబాల
క్రూరకంసనిర్మూలనకుశల గోపబాల
దారుణారివర్గవిదళనదక్ష గోపబాల
ధారుణీభారాపనయనధీర గోపభాల
గోప

రూపవిజితశతశతమదనాటోప గోపబాల
పాపరాజగర్వవిదళనకోప గోపబాల
చాపధరశ్రీరామచంద్రరూప గోపబాల
తాపహరణశీల కలిసంతాప గోపబాల
గోప

పాహి దీనజనావనశీల పాహి గోపబాల
పాహి పార్థవిజయకారణ పాహి గోపబాల
పాహి భక్తజనసందోహవరద గోపబాల
పాహి పాహి విష్ణుదేవ పాహి నందబాల
గోప


2 కామెంట్‌లు:

  1. దశావతారాల్లో బలరామావతారం లెదాండీ? నాకు తెలిసిన పాటలో కృష్ణావతారం, బలరామావతారం ఒకే చరణంలో వున్నాయి.

    కన్నెల చీరలు అన్నియు దొంగిలి
    చెన్ను మీరగను పొన్న గున్నపై
    వెన్నదొంగ యా చిన్ని కృష్ణునకు
    అన్నవు గదరా ఎన్నిక హలధర
    రామావతారా! బలరామావతారా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రన్నదే నిజం‌ లలిత గారూ. ముగ్గురు రాముళ్ళను దశావతారాల లిష్టులో చెప్పటమే సరైనది. ఎందుకంటే కృష్ణస్తు భగవాన్ స్వయం కాబట్టే అలా. ఐతే బలభద్రుడిని కాక కృష్ణుడిని ఎన్నుకోవటంలో ప్రతేకమైన కారణం ఏమీ‌ లేదు.నిజానికి ఈ కీర్తన పల్లవి 1996వ సంవత్సరంలో వ్రాసిన కీర్తనలోనిది. అది లుప్తం. పల్లవి మాత్రం గుర్తుంది. కాబట్టి పునర్నిమించటం జరిగిందిక్కడ. ఐనా అదీ బలరాముడికి బదులు కృష్ణుడిని చెప్పటానికి కారణం కాదు. అలా ఆ బలరాముడిపై చెప్పే ఆలోచన రాలేదంతే.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.