13, అక్టోబర్ 2016, గురువారం

పరమశివుని శిష్యుడీ పరశురాముడుపరమశివుని శిష్యుడీ పరశురాముడు
కర మఱుదగు విక్రమంబు కలిగినవాడు

జవమున క్రౌంచమును హంసలపాలు చేసి
శివు డిచ్చిన పరశువును చేతబట్టినాడు
అవలీలగ కార్తవీర్యార్జును పొగరణచి
కువలయపతిజాతిని కుళ్ళబొడిచినాడు
పరమ

భూమి నెల్ల కశ్యపుడను ముని కిచ్చినాడు
భూమీశులపైన పగను పోనడచినాడు
తామసము విడచినాడు తపసియై నాడు
ఆ మహేంద్రగిరివరం బందు నిలచినాడు
పరమ

విష్ణుమూర్తి యంశయై వెలసినాడు భువిని
విష్ణుసోదరికి పరమ వీరభక్తు డతడు
విష్ణుచాపము రామ విభుని చేతి కిచ్చి
విష్ణువే రాము డనుచు వినుతి చేసినాడు
పరమ


1 కామెంట్‌:

 1. కరుణలేక నీవు కడు శౌర్యముతో
  వరాయుధంబున వసుధాస్థలిపై
  ఇరువదియున్నొక్కమారు భూపతుల
  శిరములు కూలగ శరముల వేసిన
  రామావతారా! పరశురామావతారా!

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.