17, అక్టోబర్ 2016, సోమవారం

బుద్ధావతారం



బుద్ధివాదముల జూప పురుషోత్తముడు
బుద్ధుడై ధరణిపై బుట్టినాడు

తపజపహోమాదికతత్పరు లయ్యు జగ
దపకారులగుచు నధికులై
విపరీతముల జేయు కపటదైత్యులకు
చపలత్వము కల్గి బుధ్ధిసత్త్వమడగ
బుద్ధి

వేదము లందున వివరంబుల తర్క
వాదంబుల జొచ్చి పలుకుచు
భేదించెను దైత్యవరుల బుధ్ధులెల్ల
మోదించి సురలంత మొత్తి రసురులను
బుధ్ధి

తమకే తపములు తమకే వేదములు
తమకే భోగమని తలచుచు
తమకంబున నున్న తన్నడే వెన్నుండు
భ్రమలణచడె నాడు రాముడై రణమున
బుద్ధి


1 కామెంట్‌:

  1. హద్దు మీరకను హరి నీ సేవయు
    ఒద్దిక తోడను వెదకి సేయ - పరి
    శుద్ధ జనుల నీవు సూటిగ కనుగొని
    సద్దు సేయకను సరగున బ్రోచిన
    బౌద్ధావతారా! జయ బౌద్ధావతారా!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.