భయదదంష్ట్రప్రభాప్రకటనాద్భుతరూప జయశీల రణశీల స్వామి నరసింహ |
|
వరసిద్ధదోర్ధర్పదుద్భరార్భటివాని సురయక్షగంధర్వనరసిద్ధసాద్ధ్యకి న్నర హింసనుని హిరణ్యకశిపు నుద్ధతుని చరచితివి ప్రహ్లాదవరదనరసింహ |
భయద |
కినిసి సుజన పీడాకృతిని దితిసుతుని పెనగి సంధ్యావేళ పెందొడల పైన నునిచి చంపితివి తదుదరాంత్రమాలికా ఘనగళాభరణసంగ్రహణనరసింహ |
భయద |
వసుధాదిభువననిర్వహణనరసింహ అసురేశగర్వాపహరణనరసింహ అసురుడావలరావణాకృతి గొన వాని కసిమసగ రాముడై గదియు నరసింహ |
భయద |
11, అక్టోబర్ 2016, మంగళవారం
నృసింహావతారస్తుతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అంత మంచి కీర్తన రాసి చదువుకోడానికి అదే కొద్ది లయతో పాడుకోడానికి ఎక్కడికి ఆపాలో కామాలు పెడితే మరీ సంతోషం కదండీ!ఇంకా పోయేందుకు మీ సొమ్మేం ఉందీ! ఇంతమంచి సొమ్మిచ్చేశారుగా!!
రిప్లయితొలగించండిచనువుగా అనేశానూ! మన్నించండి
కొంచె చాదస్తుణ్ణి కదండీ అందుకని విరామచిహ్నా లుంచను. అవి పెట్టటం సంప్రదాయం కాదని. ఐనా మీరన్న మాట కూడా నిజమే కాబట్టి అవసరమైన చోట్ల విభజన విడిగా చూపటం మంచిదేను.
తొలగించండిపరి పరి విధముల ప్రహ్లాదుడు నిను
రిప్లయితొలగించండిహరి హరి యనచును మొరలిడగా విని
ఫెళ ఫెళమనచును స్తంభము వెడలి
కరమున హిరణ్య కశ్యపు వక్షమున
వరనఖములచే వ్రక్కలు చేసిన
సింహావతారా! నరసింహావతారా!