8, అక్టోబర్ 2016, శనివారం

మత్స్యావతార కీర్తనంవిలయజలధి నీది నట్టి పెద్దచేప
బలిమి నోడ లాగినట్టి బండచేప

జీవుల కల్పాంతమందు చేదుకొన్న చేప
ఆ వేలుపుపెద్ద మొఱ్ఱ లాలించిన చేప
భావనాతీతమైన బంగారు చేప
ఆ విష్ణుమూర్తి తానైన భలే చేప
విలయ

ఎచ్చటిదని ఓడను రప్పించినదో చేప
మ్రుచ్చు సోమకు నెట్లు పొడిచినదో చేప
మచ్చలేని విక్రమపు మామంచి చేప
అచ్చముగా వెన్నుని యవతారము చేప
విలయ

విపదంబుధి నోడయగుచు వెలసినదీ చేప
అపవర్గము చేర్చునట్టి యందమైన చేప
కృపతో మానససరసిని కొలువైన చేప
చపలత్వము లేని రామచంద్రుడైన చేప
విలయ