4, అక్టోబర్ 2016, మంగళవారం

నారాయణు డున్నాడు నాకుతోడుగానారాయణు డున్నాడు నాకుతోడుగా
శ్రీరాముడై వాడు చిత్తములో నిలచ్

వాడే యీ లోకముల ప్రభవింప జేసెను
వాడే బ్రహ్మాదుల ప్రభవింప జేసెను
వాడే లోకంబుల పంచె జీవరాసులను
వాడే కడుధైర్యమిచ్చువా డగుచు నిలచెను
నారా...

సనకసనందాదులకు సర్వస్వ మగువాడు
వనజభవశక్రాదుల వలన నుండువాడు
తనయురమున నుండు లచ్చి ధ్యానించువాడు
నను విడువక చేయిపట్టి నడిపెడివాడు
నారా..

రాముడై లోకముల రక్షించు వాడు
ధీమంతులు బుద్ధిలోన తెలియుచుండు వాడు
కామాది వికారముల గర్వమణచువాడు
నామొరాలకించు వాడు నన్ను బ్రోచు వాడు
నారా..