21, అక్టోబర్ 2016, శుక్రవారం

అంతరంగమున హరి యున్నాడుఅంతరంగమున హరి యున్నా డిక
చింతలెక్కడి వీ జీవునకు

ఏజన్మంబున నెంచి పట్టెనో
యీజీవుడు హరిచరణముల
పూజలెన్నిటిని పొలుపుగ జేసెనొ
యోజకు వచ్చుచు నున్నాడిదిగో
అంత

రామనామమున రక్తిజనించిన
ధీమంతున కిక తిరుగేదీ
ప్రేమమయునిపై పెరుగగ మమత
కామితమన్యము కలుగుట యున్నే
అంత

వైకుంఠంబున భాసిలు శ్రీహరి
లోకోద్ధరణకు కాకుత్స్థుఁడుగా
ప్రాకటముగ రామభద్రుండై తన
లో కొలువుండగ లోటొకటున్నే
అంత