మా రామచంద్రు డండి మంచివా డండి నారాయణమూర్తి యండి నమ్మండి |
|
అతిమనోహరుడండి అందాల గని యండి ప్రతిలేని వీరు డండి రామచంద్రుడు సతి సీత నెత్తుకొని జనిన రావణుని బట్టి చితుకగొట్టి చంపె నండి చెలగి యీ కోదండి |
మా రామ |
పరమ కారుణికుడండి పగవాడే అలయుచో మరల రేపు రమ్మనే మంచి వాడు సుండి పరమధర్మమూర్తి యండి పగతుని తమ్ముడికి శరణమిచ్చి రాజ్యమిచ్చు సాత్వికుడండి |
మా రామ |
సురరాజ సేవ్యు డండి శుభ్రప్రకాశు డండి హరవిరించి వినుతుడండి ఆదిపురుషు డండి పరమయోగిసేవ్యు డండి భావనాతీతు డండి నరులారా రండి రండి నమ్మి సేవించండి |
మా రామ |
14, అక్టోబర్ 2016, శుక్రవారం
మా రామచంద్రు డండి మంచివా డండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈ రోజున రామావతారంపై కీర్తన వెలువడటం కోసం ఎంత ఎదురుచూసానో. ఊపిరిసలపని పనుల ఒత్తిడి పైకి కనిపించే ఒక కారణం మాత్రమే. అసలు కారణం వేరే ఉంది. సులభంగానే వెలువరించగలను అన్న నా అహమిక అసలు కారణం అనుకుంటాను. అలా ఎలా అనిపించిందో మరి! ఆ అహం అడ్డు రావటంతో ఆయన అనుగ్రహం కాలేదు. చివరకు పశ్చాత్తాపం కలిగి, పిమ్మట చాలా నిరాశతో లేవబోతుండగా ఒక ప్రవాహంగా వచ్చింది ఈ సంకీర్తనం. ఇదొక మంచి గుణపాఠం నాకు ఇక ఎప్పుడూ ఆ అహమికకు లోనుకాకుండా ఉండేందుకు.
రిప్లయితొలగించండిఅహం,నేను చేశాను,చూశాను వగైరా భావం తొలగిపోవడం అంత తేలికంటారా?
రిప్లయితొలగించండిదేవర బ్రహ్మేంద్రాదులు బెబ్బున
రిప్లయితొలగించండికావుమనగ కౌసల్య పుత్ర యా
రావణాద్యఖిల రాక్షస సంహర
ణీవె యొనర్ప విభీషణు బ్రోచిన
మాటిమాటికిని మారుతినేలిన
రామావతారా! శ్రీ రామావతారా !