వీడే వీడే రాముడు వీడే ధర్మవిగ్రహుడు వీడే లోకారాధ్యుడు వీడేను నారాయణుడు |
|
వీడే వీడే కుమతుల నందర వీఱిడిపుచ్చే వీరుడు వీడే వీడే సుమనస్కులకు విమలజ్ఞానదీపకుడు వీడే వీడేలే సుమనసులకు వెలుగులు పంచెడివాడు వీడే వీడే జీవరాశి హృత్పీఠములందలి దేవుడు |
వీడే |
వీడే వేడే జగదాదిజుడు విశ్వంబుల జేసెడి వాడు వీడే వీడే విశ్వరక్షకుడు వీడేలే లయకారకుడు వీడే వీడే వేదవేద్యుడు వేల కొలది పేరులవాడు వీడే వీడే మునిగణంబులకు వేడుక ముక్తి నొసగువాడు |
వీడే |
వీడే వీడే మకరిబారిబడి వేడిన కరి నేలినవాడు వీడే వీడే ద్రుపదతనయమొఱ విని వేగమె రక్షించినవాడు వీడే వీడే ప్రహ్లాదునకై వీరనృసింహుండైనాడు వీడే వీడే భక్తవరదుడు వీనికి సాటి మరి యెవడు |
వీడే |
4, అక్టోబర్ 2016, మంగళవారం
వీడే వీడే రాముడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.