25, అక్టోబర్ 2016, మంగళవారం

పరులు తలచిన హరితోడ్పడవలెపరులు తలచిన హరితోడ్పడవలె
హరిసంకల్పం బప్రతిహతము

అది యిది చేయుదు ననుకొను నరునకు
తుది జరుగునది తెలిసేనా
అది శ్రీహరికే విదితము కాక
మదిలో నెఱుగుట మనుజుని తరమా
పరులు

హరి నేమార్చగ నజుడెంచినను
పరికింపగ నది భగ్నంబాయె
హరి తాను గోగోపకానీక మైన
హరు వెరుగక నల్లాడెను కాదే
పరులు

సురలు ధర్మాత్ములు హరి వారి తోడు
సురవైరులను హరియణచు
నరుడై దశరథనందనుడై హరి
పరిమార్చడె రావణప్రభృతుల
పరులు