6, అక్టోబర్ 2016, గురువారం

గోవిందుడా నిన్ను కొనియాడనీగోవిందుడా నిన్ను కొనియాడనీ ।నేను
నీవాడనై యిట్లు నిలచిపోనీ

లేదు విచారము లేదు వినాశము
లేదు నీవారికి లేమియన
లేదొక కామము లేదొక మోహము
లేదు కలిభయమును నీదయ లుండగ
గోవిందుడా

కావున నీయందు కపటమే లేని
భావనలే కాని ప్రభవించని
జీవుడనై యుంటి సేవించు చుంటి
నీవే సర్వము నిశ్చయమనుచు
గోవిందుడా

ప్రేముడి మీఱగ వేమార్లు దినమును
రామ రామ యందు నేమరక
రామగోవింద సర్వ రక్షక కృపజూపి
నామొఱలాలించి నన్నేలరా
గోవిందుడా