15, అక్టోబర్ 2016, శనివారం

లోకనాయకుడవని నీకు చెప్పుకొందుములోకనాయకుడవని నీకు చెప్పుకొందుము
మా కష్టము శ్రీరామ మన్నింపుము

మొదట భువనముల జేసి ముచ్చటగా నీవు
పదునాలుగు సుందరముగ భాసించ
తుదిలేని క్రీడ నొండు మొదలిడితివి గాద
యిదిగిదిగో యీజీవుల మిచట నాడగ
లోక

మరియాద కప్పుడపుడు మామధ్య కరుదెంచి
పరమదివ్యలీలలను పచరించి
అరిగెదవు క్రీడాంగణ మంతయు సరిజేసి
పరుగిడిపరుగిడి మేము బడలితి మయ్య
లోక

ఆడలేక మొత్తుకొను నట్టి జీవాళి మయ్య
వేడుకొందు మొక్కింత విశ్రాంతి
ఆడించువాడ మా కానతి దయచేయ వయ్య
వేడకతో తొల్లింట విశ్రమించు డనుచు
లోక