13, నవంబర్ 2016, ఆదివారం

కమలదళేక్షణ భళీభళీ


కమలదళేక్షణ భళీభళీ కమలానాయక భళీభళీ
కమలోదరహరి భళీభళీ కమలవదనహరి భళీభళీ

విమలచరిత్ర సుందరగాత్ర సుమధురవరద భళీభళీ
అమితవిక్రమ అసురనిగ్రహ అమరనాథనుత భళీభళీ
కుమతినివారక సుజనసుపోషక కువలయరక్షక భళీభళీ
కమలాసేవిత మునిజనభావిత కమలజసేవిత భళీభళీ
కమల

దశావతార త్రిలోకపాలక దైన్యనివారక భళీభళీ
ప్రశాంతవదన పరిపంధిజనప్రశాంతిభంజన భళీభళీ
విశేషఫలద విమోహనాశక విజ్ఞానప్రద భళీభళీ
దశాస్యముఖ్యనిశాచరాధిపదంభవిదళన భళీభళీ
కమల

పరమయోగిజనభావితచరణా పరమాత్మా హరి భళీభళీ
పరమదయాపర నిరుపమశుభగుణవారాన్నిధి హరి భళీభళీ
ధరణీతనయావర సురహితకర దశరథనందన భళీభళీ
నరనాయక హరి మోక్షదాయక నను నడిపింతువు భళీభళీ
కమల



3 కామెంట్‌లు:

  1. గమనిక: కొద్ది రోజుల విరామం తరువాత, ఈరోజు నుండి రామకీర్తనలలో మూడవ వందకు ప్రారంభం.

    రిప్లయితొలగించండి
  2. మీ ఈ రామ త్రిశతక ప్రారంభ కీర్తన భళీ భళీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భళిభళి శ్రీరామ నీవు వ్రాయించిన కీర్తనము
      మెళుకువగలవారి వలన మెచ్చువచ్చు కీర్తనము

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.