5, నవంబర్ 2016, శనివారం

హరి యనవే హరి యనవే


హరి యనవే హరి యనవే
హరికృప చాలని యనవే యనవే

సకలదేవగణ సకలమౌనిగణ
నికరము తనయెడ నిరుపమభక్తిని
ప్రకటించగ శ్రీరాముడైన హరి
యొకడే చాలని మనసా
హరి

హరిని రాముడని యరసి వేడుకను
పరమభక్తి గొని పరిపరి విధముల
నిరుపమానశుభనిశ్చయ గరిమను
విరిసి కొలుచుచు మనసా
హరి

శరణు వేడితే కరుణ బ్రోచు నని
సురనరవిహగాసురవర్గములు
కరము పొగడు నా ఘనుని రాముని
హరియని తెలిసిన మనసా
హరి


2 కామెంట్‌లు:

  1. మొదట "సురనరవిహగ-వానర" వర్గములేమో అనిపించిందండి - మళ్లీ విభీషణుడు గుర్తుకొచ్చి "అసుర" వర్గమూ సరిపోయినట్టనిపించింది :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలిత గారూ, చక్కగా అర్థంచేసుకున్నారు. ధన్యవాదాలు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.