9, నవంబర్ 2016, బుధవారం

హరినామ జపమున


హరినామజపమున నగుగాక శుభమని
పరికించి రాముని భజియించు ఘనుడు

భవదోషముల నెల్ల పడద్రోయ హరినామ
మవలంబనం బనుచు నాత్మలో దలచి
భువి నందరను గాచి ముక్తినిచ్చెడు దాని
నవిరళంబుగ జేయు నతడెపో ఘనుడు
హరి

ధవళాయతాక్షుడు ధర్మావతారుడు
వవనాత్మజాసేవ్యపాదరాజీవుడు
రవికులోత్తముడు శ్రీరాముడే హరియని
యెవడు సేవించునో యెంచవాడే ఘనుడు
హరి

రాతి నచ్చెరువుగను నాతిగా జేసిన
కోతికే బ్రహ్మగా గొప్ప నందించిన
ప్రీతితో విభీషణు విభునిగా జేసిన
సీతామనోహరుని చేరువాడే ఘనుడు
హరి



3 కామెంట్‌లు:

  1. ముఖ్య గమనిక రామానుగ్రహంతో యీ రామకీర్తనతో ఇప్పటికి 200ల కీర్తనలు సంపన్నం కావటం‌ జరిగింది. (సెప్టెంబరు 9న 100వ రామకీర్తన వెలువడింది. ఈ 200వ రామకీర్తన నవంబరు 9న వెలువడింది.)

    రిప్లయితొలగించండి
  2. రెండు వందల రామకీర్తనలు పూర్తి చేసిన మీకు శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.