తెలుగుజాతిపరువు గంగ
కలసిపోయెరా రామ
కలతపడిన మనసుతోడ
తలచుచుంటిరా రామ
కుటిల మాయె రాజనీతి
గుటుకుమనెను తెలుగుఖ్యాతి
చిటపటల మధ్యక్రాంతి
ఎటుల గల్గు నింక శాంతి ॥తెలుగు॥
ఒక్కటగుట పాపమేల
ముక్క చెక్కలాయె నేల
అక్కటా అభివృధ్ధి లీల
పక్కదారి పట్టనేల ॥తెలుగు॥
తెలుగుజాతి కలహాలకు
కలుగునట్టి ఫలితాలకు
కలగునట్టి హృదయాలకు
కలత దీరు టెన్నాళ్ళకు ॥తెలుగు॥
(జూలై 31, 2013)
కలసిపోయెరా రామ
కలతపడిన మనసుతోడ
తలచుచుంటిరా రామ
కుటిల మాయె రాజనీతి
గుటుకుమనెను తెలుగుఖ్యాతి
చిటపటల మధ్యక్రాంతి
ఎటుల గల్గు నింక శాంతి ॥తెలుగు॥
ఒక్కటగుట పాపమేల
ముక్క చెక్కలాయె నేల
అక్కటా అభివృధ్ధి లీల
పక్కదారి పట్టనేల ॥తెలుగు॥
తెలుగుజాతి కలహాలకు
కలుగునట్టి ఫలితాలకు
కలగునట్టి హృదయాలకు
కలత దీరు టెన్నాళ్ళకు ॥తెలుగు॥
(జూలై 31, 2013)