28, జులై 2013, ఆదివారం

ముఖ్య గమనిక: శ్యామలీయం నుండి భాగవతం కోసం ప్రత్యేకంగా కొత్త బ్లాగు.

శ్యామలీయం‌ పాఠకులకు ముఖ్య గమనిక
భాగవతం ఇకనుండి కొత్త బ్లాగులో దర్శనమిస్తుంది.
వివరాలకు చూడండి:
    శ్యామలీయం భాగవతం

నేడే ప్రకటించిన భాగవతం కొత్త టపా
    
     ప్రధమస్కంధం: 04. శ్రీవేదవ్యాస భగవానులవారి వద్దకు శ్రీనారదులవారు వచ్చుట

గమనిక:

సంకలిని హారం ఈ‌ కొత్త బ్లాగును చూపిస్తోంది.

కూడలి  కూడలి వారు ఇంకా కరుణించలేదు.  వారికి నేను ఇప్పటికే మూడు సార్లు గుర్తు చేసినా ఫలితం కనబడలేదు.

సంకలిని మాలిక వారు నా శ్యామలీయం‌ బ్లాగును చూపటం మానేసారు.  సాంకేతిక కారణాలవలన అంటున్నారు.  కొత్తబ్లాగుకూడా ఇంతవరకు చూపటం లేదు.

ఇకపోతే జల్లెడ వారు ఈ శ్యామలీయం బ్లాగును కూడా చేర్చుకోలేదు, పలు విజ్ఞప్తులు చేసినా కూడా!  
కొత్తగా యీ‌ మధ్య వచ్చిన వేదికలో శ్యామలీయం, కొత్తబ్లాగూ కూడా చూపిస్తున్నారు.

ఒకవేళ ఇంకా యేమన్నా మంచి సంకలినులు ఉంటే వాటిలో నా బ్లాగులు చేర్చటం‌ మంచిదనిపిస్తే దయచేసి తెలియజేయండి.

ధన్యవాదాలు.

7 కామెంట్‌లు:

 1. యేం ఎందుకు చూపించాలి మీ బ్లాగుని..వాళ్ళ badge ని పెట్టుకోవడానికి మీకు స్థలం వుండదు తమ బ్లాగులో..! ఇంతోటి రాతలని గొప్ప పోతన పద్యాల్లా చదివి తరించాలి కాబోలు..!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అజ్ఞాతలకి జవాబు చెప్పాలా అన్నది ఒక ప్రశ్న.

   * వాళ్ళ badge ని పెట్టుకోవడానికి మీకు స్థలం వుండదు అని ఆక్షేపించారు. బాగుంది. కొన్ని సాంకేతికకారణాలున్నాయి. కొన్ని లోగోలు మరీ‌ పెద్దవిగా ఉన్నాయి. లోగోలు పెట్టటమా మరోవిధంగా వారి సౌజన్యానికి కృతజ్ఞత చూపటమా అన్నది ఇంకా నేను నిర్ణయించుకోలేదు.

   * ఇంతోటి రాతలంటే? నా వేమన్నా గొప్పగొప్ప రాతలని ఎన్నడైనా ఈ బ్లాగులో చెప్పుకున్నానా?
   * పోతనపద్యాలా చదివి? ఇలా అని నన్ను పోతనతో ఎందుకు పోల్చటం? అటువంటి గర్వోక్తులు మీకు ఎక్కడైనా ఈ బ్లాగులో మీకు నేను చెప్పుకోగా కనిపించాయా?
   * పోతన పద్యాల్లా చదివి తరించాలా? పోతన పద్యాలు చదవండి. చదవమనే నేను మొత్తుకునేది. తప్పకుండా చదవండి. మీరన్నట్లు తప్పకుండా తరిస్తారు.

   ఒకవిషయం. ఈ‌బ్లాగులో కామెంట్లను మోడరేట్ చేయటం‌ లేదు. మీలాంటీ వాళ్ళ సభ్యతారాహిత్యం కారణంగా మోడరేషన్ అవసరం అయ్యేలా కనిపిస్తోంది.

   మిగతా చదువరులకు ఒక విజ్ఞప్తి. ఈ అజ్ఞాత వ్యాఖ్యలవంటి వాటిని తొలగిస్తాను. విషయసంబంధికానివీ, సభ్యతాదూరమైనవీ అయిన ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరించనవుసరం లేదు.

   తొలగించండి
 2. మంచి పని మొదలెట్టినదగ్గరనుంచీ 'ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతేభూమి భారకాః, ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!'అని పలుమార్లు అనుక్కోవడమ్ ఉత్తమంలాగుంది ఈ మధ్యకాలంలో ఏ మంచి పని మొదలెట్టినా!.. బేడ్జ్ పెట్టుకోనందుకు ఆ అజ్ఞాత కినుక చూపినా... అతని ఇతర వాక్యాలు అసమంజసమైనవి, అసంబద్ధమైనవి అవసరంలేనివి... విశ్వనాథవారు చెప్పలేదూ తిన్నన్నమే రోజూ తినగాలేనిది రామకథ మళ్ళీ మళ్ళీ రాస్తే తప్పేంటి అని.. భగవత్కథ ఎవరు రాసినా అంత తియ్యందనమూ ఉంటుంది..

  రిప్లయితొలగించండి
 3. ఇక బ్లాగర్లు..చేతిలో కత్తీ,ఢాలూ...మొల్లో పిస్టోల్ పెట్టుకుని....వ్రాయాలి కాబోలు...అయినా శ్యామలీయం గారూ...మీమీద ఇంత జిల్...ల తో కత్తి దూసారేమిటండీ అగ్నాతులు...

  రిప్లయితొలగించండి
 4. ఇక బ్లాగర్లు..చేతిలో కత్తీ,ఢాలూ...మొల్లో పిస్టోల్ పెట్టుకుని....వ్రాయాలి కాబోలు...అయినా శ్యామలీయం గారూ...మీమీద ఇంత జిల్...ల తో కత్తి దూసారేమిటండీ అగ్నాతులు...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతం‌ పాపం!
   కొందరు అజ్ఞాతల పనే‌ అది కదండీ. ముఖం చాటుగా పెట్టుకుని, రాళ్ళు మాత్రం సూటిగా విసరటే వారి ప్రజ్ఞ.
   అయినా ఉచితమైన ప్రశ్నను అజ్ఞాతంగా ఉండి సిగ్గుపడుతూ‌ అడిగినా జవాబు చెబుతున్నానండీ.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.