భగవంతుణ్ణి చక్కగా తృప్తిగా మనస్సులో ధ్యానించిన తరువాత చేయవలసిన ఉపచారం ఆవాహనం. ఆవాహనం అంటే ఇష్టదేవతామూర్తిని మన ఇంటి లోపలికి ఆహ్వానించటం. మనం చేసేది మానసిక పూజ కాబట్టి ఈ ఆహ్వానం ద్వారా మనం దైవాన్ని మన మనస్సునే అనేదే ఇల్లుగా భావించి దాని లోపలికి రమ్మని స్వాగతం చెబుతున్నా మన్న మాట
ఆవాహనం
కం. భూవర భూమిసుతావర
దేవర శ్రీరామచంద్ర దివ్యప్రభావా
నీవే దిక్కని నమ్మితి
రావయ్యా పూజలంద రామయ తండ్రీ
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రమహారాజా, భూమిపుత్రిక ఐన సీతాదేవికి ప్రాణనాధుడా, అద్భుతం అయిన ప్రభావం కలవాడా! స్వామీ, నీవే నాకు దిక్కు అని నమ్మి ఉన్నాను. ఓ రాయయ్య తండ్రీ రావయ్యా. వచ్చి నా పూజలు స్వీకరించు.
(జూలై 2013)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.