శ్రీరామచంద్రులవారి పూజ నిర్విఘ్నముగా జరగాలంటే ముందుగా మనం గణపతిని ప్రార్థించాలి. ఏ దేవతామూర్తిని పూజించాలన్నా మొట్టమొదట గణపతిని పూజించటం చాలా అవసరం. అది మన సంప్రదాయం. శ్రీగణపతి సర్వవిఘ్నాలనీ తొలగించి యిష్టదేవత యొక్క పూజ చక్కగా జరిగేటట్లు తోడ్పడతాడు.
(శ్రీవైష్ణవులు గణపతిపూజకు మారుగా శ్రీవిష్ణుమూర్తులవారి సేనాపతి ఐన విష్వక్సేనుడికి పూజ చేస్తారు. చిన్న సంప్రదాయ బేధం. అంతే.)
గణపతి ప్రార్థన
క. పరమకృపామతి గణపతి
పరమేశ్వరుడైన రామభద్రుని పూజన్
జరిపించుము విఘ్నంబులు
దరి జేరగ నీక నీకు దండములయ్యా
(జూలై 2013)
(శ్రీవైష్ణవులు గణపతిపూజకు మారుగా శ్రీవిష్ణుమూర్తులవారి సేనాపతి ఐన విష్వక్సేనుడికి పూజ చేస్తారు. చిన్న సంప్రదాయ బేధం. అంతే.)
గణపతి ప్రార్థన
క. పరమకృపామతి గణపతి
పరమేశ్వరుడైన రామభద్రుని పూజన్
జరిపించుము విఘ్నంబులు
దరి జేరగ నీక నీకు దండములయ్యా
(జూలై 2013)
అమ్మ దయ తలచాలంటే అబ్బాయిగారిని మంచి చేసుకోవాలండి ముందు
రిప్లయితొలగించండి