7, జులై 2013, ఆదివారం

రామచంద్రుల సేవ చేయగ

రామచంద్రుల సేవ చేయగ
    రారే జనులారా సీతా
రామచంద్రుల సేవ చేయగ 
    రారే జనులారా!


నీలగగనఘన శ్యామలగాత్రుని 
    నిశ్చయముగ నెఱనమ్మి యెలమిని  ॥రామ ॥

పాలితత్రిభువనజాలుని సద్గుణ
    శీలుని నతజన పాలనలోలుని ॥రామ ॥

విదళిత సురరిపు వీర నికాయుని
    విమల చరిత్రుని వేదవేద్యుని  ॥రామ ॥


చెదరక బెదరక చీకాకులకు
    కదలక వదలక ఘనచిత్తమున ॥రామ ॥

బ్రహ్మాద్యమర ప్రార్థితుడైన 
    పరమపురుషుని పతితపావనుని ॥రామ ॥


బ్రహ్మానందామృతదాయకుని
    బ్రహ్మజ్ఞానప్రదాయకశీలుని  ॥రామ ॥

(వ్రాసిన తేదీ: 2013-7-6)