14, జులై 2013, ఆదివారం

పాహి రామప్రభో - 167

కం. వనితలపై తనయులపై
ధనములపై మోహమందు తగులు కొనుట చే
నిను సేవింపగ నోడెడు
మనుజులమో రామచంద్ర మన్నింపగదే


(వ్రాసిన తేదీ: 2013-6-13)