31, జులై 2013, బుధవారం

తెలుగుజాతిపరువు గంగ కలసిపోయెరా

తెలుగుజాతిపరువు గంగ 
   కలసిపోయెరా రామ
కలతపడిన మనసుతోడ 
   తలచుచుంటిరా రామ

కుటిల మాయె రాజనీతి
గుటుకుమనెను తెలుగుఖ్యాతి
చిటపటల మధ్యక్రాంతి
ఎటుల గల్గు నింక శాంతి  ॥తెలుగు॥

ఒక్కటగుట పాపమేల
ముక్క చెక్కలాయె నేల
అక్కటా అభివృధ్ధి లీల
పక్కదారి పట్టనేల  ॥తెలుగు॥

తెలుగుజాతి కలహాలకు
కలుగునట్టి ఫలితాలకు
కలగునట్టి హృదయాలకు
కలత దీరు టెన్నాళ్ళకు  ॥తెలుగు॥

(జూలై 31, 2013)

3 కామెంట్‌లు:

  1. గోదావరి చీలెరా
    చిన్నబోయెరా కృష్ణ
    మిన్నకుండేనురా పెన్న రామా!

    రిప్లయితొలగించండి
  2. నా మనస్సులో ఉన్న ప్రణాళిక అనుకున్నది అనుకున్నట్టు అమలయితే తమిళనాడుని కూడా తెలుగునాడును చేసి తెలుగుతల్లికి మూడు పాయల జడ వెయ్యొచ్చు - 2019 తర్వాత మొదలవుతుంది నా ప్రయత్నం,అది సానుకూలం అవ్వాలని కోరుకోండి!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.