31, జులై 2013, బుధవారం

పాహి రామప్రభో - 184

శ్రీరామచంద్రులకు పంచామృతస్నానం చేయించాక మనం చేయవలసిన ఉపచారం శుధ్ధోదకస్నానం.

శుధ్ధోదకస్నానం

క. జనకసుతావర  రఘునం
దన  హరి సద్భక్తిజల ముదారంబగు నా
మనసే మంచి తటాకము
తనివారగ జలకమాడ దయచేయగదే



తాత్పర్యం: ఓ రఘునందనా, సీతాపతీ, మీరు శుధ్ధోదకాలతో స్నానం చేయటానికి నా యొక్క సద్భక్తి అనే ఎంతో స్వాదువైన జలంతో చక్కగా పూర్తిగా నిండి ఉన్న నా మనస్సనే తటాకం తమ కోసం ఎదురుచూస్తూ‌ సిధ్ధంగా ఉంది.  మీకు తృప్తి కలిగే టట్లుగా హాయిగా జలకాలాడి ఆనందించండి.

(జూలై 2013)

3 కామెంట్‌లు:

  1. నా మనస్సు అలా లేదు సార్. అది కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయి ఉంది. దాన్ని చూస్తే రాముడు ఒక్క తాపు తంతాడేమో అనిపిస్తోంది. మరీ ఇంత కష్టమైన విషయాలు రాముడుకి ఎలా చెప్పాలి?

    రిప్లయితొలగించండి
  2. నా మనస్సు అలా లేదు సార్. అది కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయి ఉంది. దాన్ని చూస్తే రాముడు ఒక్క తాపు తంతాడేమో అనిపిస్తోంది. మరీ ఇంత కష్టమైన విషయాలు రాముడుకి ఎలా చెప్పాలి?

    రిప్లయితొలగించండి
  3. భలేవారే!
    చూడండి. నా మనస్సు ఇలాంటిది అని చెప్పుకోవటానికి కొంచెం సంశయిస్తున్నారు కదా? రోజూ‌ ఇలా మానసిక పూజ చేస్తున్నారనుకుందాం, అప్పుడు తప్పని సరిగా కొంచెం కొంచెంగా మనం‌ దేవుడికి నివేదించుకున్నట్లు ఉండాలీ‌ అని ప్రయత్నిస్తామన్నమాట. అలాగు మేలు జరుగుతుంది. ఒకనాటికి మనస్ఫూర్తిగా ఆ మాట అనగలిగే స్థితికి వస్తాం. తప్పకుండా. అదే పూజా పరమార్థం.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.