15, జులై 2013, సోమవారం

పాహి రామప్రభో - 168

తే.గీ. గర్భనరకంబు భరియించి గడచి పుట్టి
దుర్భరంబైన బ్రతుకుల దోగి జచ్చి
గర్భమన్యంబులో జారి కష్టపడెడు
వారలము మమ్ము కాపాడవలయు రామ

(వ్రాసిన తేదీ: 2013-6-13)



4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మీకు నచ్చినందుకు చాలా సంతోషమండీ.
      (మీరీ శీర్షికలోని పద్యాలలో ఎక్కడైనా తప్పులు దొర్లినప్పుడు దయచేసి నా దృష్టికి తీసుకు రావలసిందిగా ప్రార్థన.)

      తొలగించండి
  2. అనుకోకుండా తగిలింది ఈ బ్లాగు.చిలకమర్తి వారి ఈ పద్యం గుర్తుకు వచ్చింది.
    నీ నాథునకు నేను మేనమఱందినై ఉదయంబు నొందుట ఒక్క తప్పు
    అన్న యానతి దాటి ఆ మహాత్మునకు నిన్నుద్వాహ మొనరించు టొక్క తప్పు
    చిన్ననాటకు గోలె చెలిమిమై వారికి ఉపకారము లొనరించు టొక్కతప్పు
    గర్వితమతి వారు కావించు దౌష్ట్యంబు లొప్పరికించుట ఒక్క తప్పు
    ఒప్పులే చేయుచుండుట ఒక్క తప్పు
    తప్పు చేయక యుండుటే యొక్క తప్పు
    అన్ని తప్పులు మాయందె ఉన్న వబల
    తఱచి చూడ పార్థుని యందు తప్పు గలదె?
    మరల మరల గుర్తకు వచ్చే పద్యం!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.