30, జులై 2013, మంగళవారం

బెత్తాల వాళ్ళెవ్వరూ మిమ్ము మొత్తరు

బెత్తాల వాళ్ళెవ్వరూ మిమ్ము మొత్తరు లోనికి రండు
ఉత్తుత్తి భయమేలను రామ భక్తులందరు రండు  

శ్రీరామచంద్రులు సీతమ్మతల్లితో
పేరోలగంబుండి పిలువనంపిరి గాన
మీరెల్ల వారలు మిగుల ముదము తోడ
పారిషదులౌట పరమోత్సవము గాన  ॥ బెత్తాల ॥

కనకాసనము మీద కారుణ్యమూర్తులు
జనకసుతా రామచంద్రులు కూర్చుండి
కనులపండువ సేయ గలరంత కంటెను
మనకేమి వలయును మహితాత్ములార ॥బెత్తాల ॥

కలనైన రాముని తిలకించి మురిసేరు
తిలకించ రమ్మని దేవుడే పిలిచేను
తిలకించు వారికి తిరిగి జన్మము లేదు
బిలబిల రండయ్య విష్ణుభక్తులార  ॥ బెత్తాల ॥

(జూలై 2013)

2 కామెంట్‌లు:

  1. బెత్తాల వారు ఎవ్వరూ మిమ్ము మొత్తరు, భయాలు వద్దే వద్దు , నిర్భయ ఆగమనానికి ఈ ఆహ్వానం బాగున్నది శ్యామలీయం గారూ! ఇంతకీ ఈ పాట ఎక్కడిది? కోలాటం ఆట వారిదా?

    రిప్లయితొలగించండి
  2. స్వాగతం అనిల్ గారూ,
    నేను రాముడిపైన వ్రాస్తున్న కీర్తనలన్నీ నా రచనలేనండి. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.