3, జులై 2013, బుధవారం

పాహి రామప్రభో - 156

ఉ.రామయ దేహపోషణకు రక్షణకుం‌ భటవర్గ మింద్రియ
గ్రామము గాని వాస్తవముగా నిట బంటుల పెత్తనంబుగా
కామముఖాటవీభ్రమణకల్పితదుఃఖము లోర్వలేక నా
స్వామి యనుగ్రహింపుమని జంకుచు కుయ్యిడు దేహి దీనుడై

(వ్రాసిన తేదీ: 2013-6-9)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.