1, ఆగస్టు 2013, గురువారం

పాహి రామప్రభో - 185

శ్రీరామచంద్రులవారికి స్నానానంతరం మంచి వస్త్రాలను సమర్పించుకోవాలి. 
వస్త్రాలంటే కట్టుకోవటానికి పంచె,   పైన కప్పుకుందుకు ఉత్తరీయమూ.

వస్త్రం

కం. ఈ‌ నామనమును బుధ్ధియు
ప్రాణేశ్వర  నీకు మంచి వస్త్రంబులుగా
నే నిదె యిచ్చెద గొనుమా
జ్ఞానానందామృతాబ్ధి జానకిరామా


తాత్పర్యం.  ఓ నా ప్రాణాలకు అధినాయకుడవైన శ్రీరామచంద్రప్రభూ, ఓ జ్ఞానానందం అనే సముద్రం వంటిజానకీ రామా, నీకు ఇదే వస్త్రద్వయం సమర్పించుకుంటున్నాను.  ఈ నా మనస్సూ, బుధ్ధీ అనేవే నీకు నేను సమర్పించుకోగల అత్యత్తమమైన వస్త్రాలు. దయతో వీటిని స్వీకరించండి.

(ఆగష్టు 2013)

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.