11, ఆగస్టు 2013, ఆదివారం

పాహి రామప్రభో - 195


పూజావిధానంలో తాంబూలం అనంతరం వెంబడే నీరాజనం అనే ఉపచారం చేయటం కూడా ప్రసిధ్ధంగా కనబడుతుంది.  భగవానుణ్ణి దివ్యమైన ఉజ్వల కాంతిలో దర్శించటం అనేది ఈ ఉపచారం యెక్క ప్రధానమైనఉద్దేశం.


నీరాజనం.

క. వెలుగుల కెల్లను వెలుగై
వెలుగొందెడి దివ్యమూర్తి విజ్ఞానప్రభా
విలసనములు కర్పూరపు
వెలుగులుగా హారతి గొన వేడుదు రామా

తాత్పర్యం.  ఓ శ్రీరామచంద్రప్రభూ నువ్వు వెలుగులకే వెలుగైన వాడివి.  అటువంటి నీకా నేను వేరొక వెలుగును హారతిగా ఇచ్చే సాహసం చేసేది.  కాని రామా, ఉపచారం సమర్పించుకోవటం అనేది సముదాచారం‌ కాబట్టి, నీ కోసం ఒక దివ్యమైన హారతిగా విజ్ఞానప్రభలు అనే వెలుగులనే‌ దివ్య కర్పూర నీరాజనం‌ వెలుగుగా సమర్పించు కుంటున్నాను.  స్వీకరించి నన్ను అనుగ్రహించ వలసిందిగా వేడుకుంటున్నాను.

(ఆగష్టు ‌2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.