పూజాకారణం
కం. శ్రీరాముని కడు ప్రేముడి
నారాధించుటకు మించి యానందము సం
సారుల కుండునె మోక్ష
ద్వారము రామార్చనంబు భక్తజనులకున్
తాత్పర్యం: ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి, శ్రీరామచంద్ర ప్రభువుల వారిని మిక్కిలి ప్రేమతో పూజించుకో గలగటానికి మించిన భాగ్యం ఉంటుందా? రాములవారిని పూజ అంటే సాక్షాత్తూ మోక్షద్వారమే! అందుకే ఆయన్ని మనసారా పూజిద్దాం.
సంకల్పము
కం. మనసార నిన్ను గొల్చెద
తని వోవగ నిపుడు జనకతనయానాథా
వినతాసుతఘనవాహన
మునిజననుత రామచంద్రమూర్తీ భక్తిన్
తాత్పర్యము: ఓ రామచంద్రమూర్తీ, జానకీపతీ, వినతాదేవి కుమారుడు గరుత్మంతుణ్ణి ఆదరంగా వాహనం చేసుకున్న వాడా (అనగా నీవే శ్రీమహావిష్ణువూ అని సంబోధిస్తున్నామన్న మాట), జ్ఞానులైన మునులచేత స్తుతించబడేవాడా, భక్తితో, ఇప్పుడు నిన్ను నా మనస్సులో తనివితీరేటట్లుగా అర్చిస్తున్నాను.
గణపతి ప్రార్థన
కం. పరమకృపామతి గణపతి
పరమేశ్వరుడైన రామభద్రుని పూజన్
జరిపించుము విఘ్నంబులు
దరి జేరగ నీక నీకు దండములయ్యా
తాత్పర్యం: ఓ ఎంతో దయగల వాడా గణపతీ, ఇప్పుడు నేను పరమేశ్వరుడైన శ్రీరామచంద్రుల వారికి మానసిక పూజ చేద్దామని సంకల్పం చేసుకున్నాను. నీకు అనేక నమస్కారాలు చేసుకుంటున్నాను. ఈ పూజా కార్యక్రమానికి ఏ ఆటంకాలూ రాకుండా చక్కగా జరిపించు.
ధ్యానము
కం. ధ్యానింతును నా మదిలో
మౌనీంద్రార్చితుని సర్వమంగళమూర్తిన్
జ్ఞానానందమయుండగు
భూనాధుని రామచంద్రమూర్తిని కూర్మిన్
తాత్పర్యం: రామచంద్రమూర్తి జ్ఞానానంద మయుడు. సార్వభౌముడు. సర్వమంగళమైన స్వరూపం కలవాడు. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని నా హృదయంలోఎంతో ప్రేమపూర్వకంగా ధ్యానం చేస్తున్నాను.
ఆవాహనం
కం. భూవర జనకసుతావర
దేవర శ్రీరామచంద్ర దేవసుపూజ్యా
నీవే దిక్కని నమ్మితి
రావయ్యా పూజలంద రఘురామయ్యా
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రమహారాజా, భూమిపుత్రిక ఐన సీతాదేవికి ప్రాణనాధుడా, దేవతలచేత చక్కగా పూజ లందుకునేవాడా, స్వామీ, నీవే నాకు దిక్కు అని నమ్మి ఉన్నాను. ఓ రఘురామా రావయ్యా. వచ్చి నా పూజలు స్వీకరించు.
ఆసనం
కం. మనుజేశ రామ నాదగు
మనమును దయచేసి దివ్యమణిమయ సింహా
సనముగ గైకొన వయ్యా
జనకసుతా సహితముగను సంతోషముగన్
తాత్పర్యం: ప్రభూ మీకు నా మనస్సు అనేదే మంచి మణిమయ సింహాసనంగా అర్పించుకుంటున్నాను. శ్రీరామచంద్రా, సీతమ్మతల్లితో కలిసి, మీరు సుఖంగా సంతోషంగా ఈ ఆసనం అలంకరించండి.
పాద్యం
కం. ఏ కాళ్ళ గంగ పుట్టిన
దా కాళ్ళను కడుగ నెలమి నడిగెద తండ్రీ
నా కీ భాగ్యము నిమ్మా
శ్రీకర కరుణాలవాల సీతారామా
తాత్పర్యం: తండ్రీ సీతారామచంద్ర ప్రభూ. ఏ కాళ్ళనుండి గంగ జన్మించిందో, అ దివ్య పాదాలను ప్రేమతో కడిగే భాగ్యం ప్రసాదించండి. మీరు ఎంతో దయగల వారు. మీరు సాక్షాత్తూ మోక్షాన్ని ప్రసాదించేవారు. అలా అనుగ్రహించి నన్ను ధన్యుడిని చేయండి. (శ్రీమహావిష్ణువే శ్రీరాములవారు. శ్రీమహావిష్ణువు వామనావతారం ఎత్తినప్పుడు ఆయన పాదం బ్రహ్మలోకాన్ని సమీపించగానే ఆశ్చర్యానందాలతో బ్రహ్మదేవుడు తన తండ్రి పాదాలను, తన కమండలంలోని జలంతో కడిగి ధన్యుడయ్యాడు. ఆ జలమే గంగ అనే పేర దివ్యనది అయింది.)
అర్ఘ్యం
కం.మానసకలశ స్థితమగు
నానందామృతము నిత్తు నర్ఘ్యంబుగ వి
జ్ఞానసుగంధముతో రా
మా నా సద్భక్తిశ్రధ్ధ లనెడు విరులతో
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రప్రభూ నా మనస్సనే ఉత్తమమైన కలశంలో ఆనందామృతం అనే మంచి జలం తీసుకుని వచ్చాను. ఈ జలం, మీ దయ వలన, చక్కగా మీ యందు నాకు కలిగిన విజ్ఞానం అనే దివ్య సుగంధంతో పరిమళిస్తున్నది. స్వామీ మీకు యీ జలాలను నా భక్తీ, శ్రధ్ధా అనే మనోహరమైన పుష్పాలతో పాటు అర్ఘ్యంగా సమర్పించుకుంటున్నాను.
ఆచమనం
కం. రాకేందు వదన రామా
నీకన్న విశుధ్ధు లెవరు నిక్కంబరయం
గైకొను మాచమనీయము
శ్రీకర నా భక్తికలశశీతాంబువులన్
తాత్పర్యం: ఓ రామచంద్రా, పూర్ణచంద్రుని వంటి ముఖంతో ప్రసన్నంగా ఉండే చల్లని స్వామీ. నీకన్నా నిజానికి పరిశుధ్ధు లెవ్వరయ్యా? ఐనా ఆచారం ప్రకారం నీకు ఆచమనీయం సమర్పించు కుంటున్నాను. స్వామీ, స్వీకరించండి. ఇవి నా భక్తికలశం అనే పాత్రలో నిండి ఉన్న ఉత్తమ జలాలు. (అంటే నా భక్తియే ఆ కలశంలో ఉదకరూపంగా ఉంది అని భావం) ఈ జలం చక్కగా నిర్మలంగా చల్లగా మీకు చాలా హితకరంగా ఉంటుంది. దయచేసి మీరు ఈ జలాలు స్వీకరించి ఆచమించండి.
పంచామృతస్నానం
ఆ.వె. భక్తి కొలది నీకు పంచామృతములుగా
శ్రవణ మనన దాస్య సఖ్య సేవ
నంబు లమర జేసి స్నానార్థ మిచ్చితి
కొనుము రామచంద్ర కోమలాంగ
తాత్పర్యం: శ్రీరామచంద్రా, పంచామృతలైన పాలూ, పెరుగూ, నేయీ, తేనే, ఫలరసాలను శ్రవణమూ, మననమూ, దాస్యమూ, సఖ్యమూ, సేవనమూ అనే నా భక్తి విశేషాలు సమకూర్చుతున్నాయి స్వామీ. చక్కగా ఈ పంచామృతాలతో స్నానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
శుధ్ధోదకస్నానం
క. జనకసుతావర రఘునం
దన హరి సద్భక్తిజల ముదారంబగు నా
మనసే మంచి తటాకము
తనివారగ జలకమాడ దయచేయగదే
తాత్పర్యం: ఓ రఘునందనా, సీతాపతీ, మీరు శుధ్ధోదకాలతో స్నానం చేయటానికి నా యొక్క సద్భక్తి అనే ఎంతో స్వాదువైన జలంతో చక్కగా పూర్తిగా నిండి ఉన్న నా మనస్సనే తటాకం తమ కోసం ఎదురుచూస్తూ సిధ్ధంగా ఉంది. మీకు తృప్తి కలిగే టట్లుగా హాయిగా జలకాలాడి ఆనందించండి.
వస్త్రం
కం. ఈ నామనమును బుధ్ధియు
ప్రాణేశ్వర నీకు మంచి వస్త్రంబులుగా
నే నిదె యిచ్చెద గొనుమా
జ్ఞానానందామృతాబ్ధి జానకిరామా
తాత్పర్యం: ఓ నా ప్రాణాలకు అధినాయకుడవైన శ్రీరామచంద్రప్రభూ, ఓ జ్ఞానానందం అనే సముద్రం వంటిజానకీ రామా, నీకు ఇదే వస్త్రద్వయం సమర్పించుకుంటున్నాను. ఈ నా మనస్సూ, బుధ్ధీ అనేవే నీకు నేను సమర్పించుకోగల అత్యత్తమమైన వస్త్రాలు. దయతో వీటిని స్వీకరించండి.
యజ్ఞోపవీతం
కం. ఇది నా నవనాడులతో
ముదమున సమకూర్చి బ్రహ్మముడి యనగా నా
హృదయం బమరించిన యది
సదమల ముపవీత మయ్య జానకిరమణా
తాత్పర్యం: ఓ జానకీపతీ, శ్రీరామచంద్రా, నా హృదయమే బ్రహ్మముడిగా, నా నవనాడులే ఉపవీతపు పోగులుగా నీకు యజ్ఞోపవీతం సమర్పించుకుంటున్నాను. నీయందలి భక్తి కారణంగా పునీతమైన నా హృదయమూ నవనాడులతో యేర్పడిన ఇది మిక్కిలి నిర్మలమైన శ్రేష్ఠమైన యజ్ఞోపవీతం. దీనిని మీరు స్వీకరించవలసినది.
గంధం
కం. దీనికి మించిన గంధము
కానంబడ దుర్వి మీద కావున దయతో
ఈ నా భక్తి సుగంధము
చే నందుము రామచంద్ర సీతారమణా
తాత్పర్యం: భగవంతుడి సృస్టిలో ఉన్న ఈ భూప్రపంచంలో ఉన్నాం మనం. ఇక్కడ ఉన్న అన్ని పరిమళభరితమైన వస్తువుల్లోనూ ఉత్తమోత్తమమైనది భగవద్భక్తి అనే సుగంధం. సుగంధం అనే వస్తువు యొక్క లక్షణం మనోహరమైన పరిమళంతో మనస్సుకి ప్రీతికలిగించటం కదా. భగవంతుడికి భక్తుడివ్వగలిగిన అత్యంత ప్రీతికరమైన వస్తువు భక్తి. అందుచేత మనం స్వామితో, ఓ స్వామీ సీతారమణా, ఈ నా భక్తి అనేదే భూప్రపంచంలో నేను నీకు ఇవ్వగలిగిన అత్యంత సుగంధపూరితమైన మైసేవ. దీనిని దయతో స్వీకరించండి అని ప్రార్థిస్తున్నా మన్నమాట.
అక్షతలు
తే. అక్షతంబన బరగు బ్రహ్మంబ వీవె
అక్షతము లౌచు నన్ని దేహముల యందు
అహము మమతయు నా కబ్బు నవియె ప్రీతి
అక్షతల జేసి పూజింతు నయ్య రామ
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రా, సృష్టిలో ప్రతీదీ క్షతమే - అంటే - ఏదో ఒక విధంగా కాలం చేత కొట్టబడిందే. ఆలా కొట్టబడని అక్షతమైన తత్వము సాక్షాత్తూ బ్రహ్మము వైన నీవే. ఐతే నా వద్ద రెండు అక్షతలు ఉన్నాయి. ఒకటి అహంకారం, మరొకటి మమకారం - ఈ రెండూ జీవుడనైన నన్ను జన్మజన్మల్లోనూ వదలకుండా వెంట బడుతున్నాయి. ఈ రెండింటినీ మాత్రం కాలం ఏమీ బాధిస్తున్నట్లు తోచదు. ఈ రెండు అక్షతలనూ సంతోషంగా నీకు పూజార్థం సమర్పించుకుంటున్నాను. వీటిని నీవే చక్కగా వినియోగించు. (నా అహంకార మమకారాలను సరియైన దారిలో నడపమని రాములవారిని వేడుకుంటున్నానని అర్థం)
ఆభరణం
కం. విలువగు రత్నము లైదన
గలవు సుమా నాదు ప్రాణఘనరత్నము లో
కుల దైవమ నీ పాదం
బుల కడ నుంచెదను రామ భూవర ప్రీతిన్
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రప్రభూ, నీ వంటి వానికి మిక్కిలి అమూల్యమైనవే సమర్పించాలి కాని అలాంటివీ ఇలాంటివీ ఇవ్వవచ్చునా. నీవు రాజువు, రాజులు రత్నప్రియులు కదా. నా దగ్గర అత్యంత విలువైన ఐదు రత్నాలున్నాయి. అవి నా ప్రాణాలన్న పేరుతో పిలువబడుతూ ఉంటాయి. నాకు సంబంధించినంత వరకూ ఈ ప్రపంచంలో, ఇంత కంటే విలువైన రత్నాలే లేవు మరి. ఎంతో సంతోషంగా ఈ ఐదింటినీ కూడా కులదైవం అయిన నీ పాదాల వద్ద ఉంచుతున్నాను. స్వీకరించి అనుగ్రహించ వలసింది.
పుష్పం
కం. పంచేంద్రియ సంపుటియే
పంచదళంబులుగ భక్తి పరిమళముగ నా
మంచి హృదయ సుమము సమ
ర్పించెద దయచేసి స్వీకరించవె రామా
తాత్పర్యం: శ్రీరామచంద్రప్రభూ, నేను నీకు నా హ్యదయాన్నే దివ్యపుష్పంగా సమర్పించుకుంటున్నాను. దీనికి చక్కగా నా పంచేద్రియములనే ప్రశస్తమైన రేకులూ, భక్తి అనే పేరుగల ఎంతో మనోహరమైన పరిమళమూ ఉన్నాయి. ఇంతకంటే మంచి పుష్పం లేదూ, ఇది చాలా ఉత్తమోత్తమమైన పుష్పం అని నీకు వినయంగా సమర్పించుకుంటున్నాను.
ధూపం
కం. పంచప్రాణంబులతో
నంచితమగు ధూపమిచ్చు టత్యుచితమౌ
నంచు తలంచితి నిచ్చితి
నించుక దయచూపి యేలవే రఘురామా
తాత్పర్యం: నీకు ఎటువంటి ధూపం ఇచ్చేదీ? నా పంచప్రాణవాయువులూ నీభక్తిపరీమళంతో నిండిపోయి ఉన్నాయి. అందుచేత వాటితోటే నీకు ధూపం సమర్పించటం అత్యంత ఉచితంగా ఉంటుందని భావిస్తున్నాను. అందుచేత నా భక్తిపరీమళపూరితమైన ఈ ధూప సుగంధాన్ని ఆఘ్రాణించి నా మీద అనుగ్రహం చూపవలసింది.
దీపం
కం. త్రైలోక్యదీపనుడ వే
యేలాగున తగిన దీప మేర్పడ చూపం
జాలుదు రామా చూపెద
నా లో పలి జ్ఞాన జ్యోతి నళినదళాక్షా
తాత్పర్యం: ఓ కలువ కన్నుల దేవరా శ్రీరామచంద్రా, నీవే మూడులోకాలకూ వెలుగైన వాడివి. నీకు ఏమని నేను దీపం చూప గలను స్వామీ? నా దగ్గర ఒక ప్రశస్తమైన జ్యోతి ఉంది. దానిని జ్ఞానజ్యోతి అంటారు. నాకు తెలిసి అంతకంటే గొప్ప వెలుగు లేదు. దానినే నీకు దీపదర్శనం కోసం అర్పిస్తున్నాను.
నైవేద్యం
కం. నాదని యేమున్నది నీ
పాదంబుల చెంతనుంచ భక్తుడ నీ వెం
తో దయనిచ్చిన దీని ని
వేదించెద జీవితమును వేదవిహారా
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రప్రభూ! నాదని ప్రత్యేకంగా యేమీ లేదు కదా. అంతా నీవు ప్రసాదించినదే. అందు చేత, ఇదిగో ఇది నేను నీ పాదాల వద్ద నివేదించు కుంటున్నాను అని చెప్పి ఇవ్వగలిగింది ఏదీ కనబడటం లేదు. అందు చేత, నీ విచ్చినదే అయినా నా జీవితాన్నే నీకు నివేదించుకుంటున్నాను. నేకు నేను ఇవ్వగలది అంత కంటే శ్రేష్ఠమైనది మరేమీ లేదు కదా. దయచేసి స్వీకరించండి.
తాంబూలం
క. ఆకులుగా త్రిగుణంబులు
పోకలుగా మనసు బుధ్ధి పోడుములున్ చూ
ర్ణాకృతి నహ మొప్పంగను
మీకున్ తాంబూల మిత్తు మేలుగ రామా
తాత్పర్యం: ఓ రామచంద్రప్రభూ. మీకు మేలైన తాంబూలం సమర్పించటానికి అనుమతి నివ్వండి. నా త్రిగుణాలే తములపాకులుగా, నా మనస్సు, బుధ్ధి అనేవే పోక చెక్కలుగా, నేను అన్న భావననే చూర్ణం చేసి అదే సున్నంగా మీకు తాంబూలం సిథ్థం చేసాను. దయచేసి నేనివ్వ గలిగింతలో ప్రశస్తమైన యీ తాంబూలాన్ని గ్రహించి అనుగ్రహించండి.
నీరాజనం
క. వెలుగుల కెల్లను వెలుగై
వెలుగొందెడి దివ్యమూర్తి విజ్ఞానవిభా
విలసనములు కర్పూరపు
వెలుగులుగా హారతి గొన వేడుదు రామా
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రప్రభూ నువ్వు వెలుగులకే వెలుగైన వాడివి. అటువంటి నీకా నేను వేరొక వెలుగును హారతిగా ఇచ్చే సాహసం చేసేది. కాని రామా, ఉపచారం సమర్పించుకోవటం అనేది సముదాచారం కాబట్టి, నీ కోసం ఒక దివ్యమైన హారతిగా విజ్ఞానప్రభలు అనే వెలుగులనే దివ్య కర్పూర నీరాజనం వెలుగుగా సమర్పించు కుంటున్నాను. స్వీకరించి నన్ను అనుగ్రహించ వలసిందిగా వేడుకుంటున్నాను.
మంత్రపుష్పం
సర్వేశ కల్పించి సకలలోకముల
నిర్వహింతువు నీవు నిరుపమ లీల
కర్మసాక్షులు నీకు కన్నులై యుండ
చల్లగా చూచెద వెల్ల లోకముల
పరమాత్ముడవు నిన్ను భావించువారి
సంరక్షణము నీవు సలిపెద వెపుడు
సర్వాత్మనా నిన్ను చక్కగా నమ్మి
ఉర్విపై నీవార మున్నాము తండ్రి
ధర్మం బధర్మంబు తప్పొప్పు లనుచు
మాకేమి తెలియును మము గన్న తండ్రి
నీ పాదముల చెంత నిలుచుట తప్ప
అన్య మెఱుగని వార మయ్య రక్షించు
నీ రక్షణము కోరి నిలచి యున్నాము
నీ నామమును నమ్మి నిలచి యున్నాము
నీ దివ్యచరితంబు నిగమమై యుండు
నీదు ప్రభావంబు నిత్యమై యుండు
నీ యందు మా బుధ్ధి నిలబడు నట్లు
నీవు మన్నింపవే నిగమైక వేద్య
నీ దయామృతవృష్టి నిష్పాపు లగుచు
నీ ధామమును చేర నీవయ్య మమ్ము
వేరొండు వరముల వేడబోమయ్య
చిత్తగించుము దేవ శ్రీరామచంద్ర
క. ఈ మనవియె మంత్రముగా
నా మానసపుష్ప మిదియె నా స్వామీ శ్రీ
రామా నీ కర్పించెద
భూమిసుతారమణ నన్ను బ్రోవుము తండ్రీ.
తాత్పర్యం: స్వామీ, శ్రీరామచంద్రా, నీవు విష్ణువువు. సకలలోకాలనూ కలిగించి నీ అద్భుతమైన లీలతో రక్షిస్తున్నావు. కర్మసాక్షులైన సూర్యచంద్రులు సాక్షాత్తూ నీ కళ్ళే. నువ్వు లోకాలన్నిటినీ చల్లగా చూస్తున్నావు. నీ భక్తులను రక్షిస్తుంటావు. మాకు ధర్మాలూ అధర్మాలూ తప్పులూ ఒప్పులూ ఏమి తెలుసు, నిన్నే నమ్ము కున్నాము. నీ పాదాల దగ్గర నిలబడి ఉన్నాం. నిన్నే నమ్మి ఈ భూమి మీద జీవిస్తున్నాం. నీ నామాన్ని నమ్ముకున్నాం - నీ రక్షణ కోరుతున్నాం. నీ చరిత్ర వేదం. నీ ప్రభావం నిత్యం. మా బుధ్ధి నీ మీద నిలచి ఉండేటట్లు అనుగ్రహించు. నీ దయ చేత పాపాలన్నీ పోయి చివర నీ పరమపదానికి మేము చేరుగునేవరం ఇవ్వు. ఇంకేమీ అక్కర లేదు. దేవా శ్రీరామచంద్రా ఈ మనవిని చిత్తగించు.
నాకు మంత్రాలు రావు. నా మనవినే మంత్రం అనుకో తండ్రీ, నా మనస్సే మంచి పుస్పం అనుకో. ఈ మంత్ర పుష్పం స్వీకరించి నన్ను అనుగ్రహించు.
నమస్కారం
కం. ఈ కొలది పూజ గైకొని
నాకు ప్రసన్నుండవగుము నా తండ్రీ రా
మా కరుణామృత సాగర
నీకు నమస్కారశతము నీరజనయనా
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రప్రభూ, కరుణామృత సముద్రుడా. ఏదో నాశక్తి కొలదీ, భక్తికొలదీ చేసీ యీ కొంచెపు పూజను దయచేసి స్వీకరించవలసినది. నాకు ప్రసన్నుడవు కావలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఓ కలువకన్నుల దేవరా, నీకు మనసా వంద నమస్కారాలు చేస్తున్నాను.
ప్రదక్షిణం
క. నీ చుట్టు నేను తిరుగుట
నా చిత్తము గోరు టదియె నా భాగ్యము నే
డీ చిన్న పూజగైకొని
ప్రోచిన నది చాలు రామభూవర నాకున్
తాత్పర్యం: ఓశ్రీరామచంద్ర భూనాథా, నా మనస్సు ఎప్పుడూ నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అది నా భాగ్యం అనుకుంటున్నాను. నా ఈ చిన్న పూజను స్వీకరించి నన్ను సంరక్షించు. అది నాకు చాలు. నాకు మరేమీ కోరిక లేదు.
క్షమాప్రార్థన.
క. మనసున భక్తిశ్రధ్ధలు
తనరారగ పూజ సేయ దలచితి నైనన్
పనవుదు తప్పులు దొరలుట
గని మానవుడను గద దయగనుమా రామా
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రా, మనస్సునిండా భక్తీ శ్రధ్దా నిండి ఉండగా నీకు పూజ చేసుకుందామని తలిచాను. అయినా తప్పులు దొర్లటం వలన చాలా విచారం కలుగుతోంది. మానవుణ్ణి కదా. నన్ను దయతలచు. క్షమించి, ఈ పూజను స్వీకరించి కృతార్థుడిని చేయవలసింది.
అర్పణం
క. మానసికంబుగ చేసిన
ఈ నా చిరుపూజ నీకు హృదయంగమమే
యౌనని తలచెద రామా
దీని మహాఫలము గొనుము దీవన లిమ్మా
తాత్పర్యం: ఓ శ్రీరామచంద్రప్రభూ! ఈ విధంగా నా మనస్సులోనే నీకు నేను చేసుకున్న చిరుపూజ నీ మనస్సుకు ఆనందం కలిగిస్తుందనే తలుస్తున్నాను. ఇలా నిన్ను పూజించుకోవటం మహాపుణ్యఫలాన్ని ఇస్తుందని నాకు తెలుసు. ఆ ఫలాన్ని కూడా నీకే అర్పించుకుంటున్నాను. దయచేసి అదికూడా స్వీకరించి అనుగ్రహించు. నన్ను దీవించవయ్యా. అది చాలు నాకు.

చాలా బాగుందండి.
రిప్లయితొలగించండిశ్రమ అనుకోకుండా మాత్రు బాషలో శ్రీ రామ పూజ విదానాన్ని పొందుపర్చిన మీ క్రుషి అభినందనీయం శ్యామల రావు గారు. మీకు వీలుంటే నరసింహా స్వామి మానసిక పూజా విదానం కూడ తెలుగు బాషలో పొందుపర్చ గలరు. మీరన్నట్లు మూలం విస్మరించకుండా దేనినైనా మార్పులు చేయటానికి కేవలం విషయ పరిజ్నానమే కాక నిస్వార్దత కూడా ఉండాలి. అవి మీకు ఆ శ్రీ రామ చంద్రుడు ప్రసాదించాడు అని బావిస్తున్నాను.దన్యవాదములు.
రిప్లయితొలగించండివీలువెంబడి అలాగే ప్రయత్నిస్తానండీ.
తొలగించండి