29, ఆగస్టు 2013, గురువారం

ఆధ్యాత్మికవేత్తలూ - వైద్యసలహాలూ.

ఈ‌ రోజున  హరిసేవ బ్లాగులో  డయాబెటిస్ - ఒక ప్రాణశక్తి సంక్షోభం :సద్గురు  అని ఒక టపా వచ్చింది.  దానిమీద కామెంటు పెట్టటం మొదలు పెట్టితే, నా వ్యాఖ్య పెద్దదిగా అవుతుందన్న సందేహం కలిగింది.  అందుచేత, ఒక కామెంటుగా అక్కడ ఉంచటం బాగుండదని అనిపించింది. అందుకే ఒక టపా రూపంలో నా అభిప్రాయాలు ఇక్కడ వ్రాస్తున్నాను.

ఈ ఆధ్యాత్మిక వేత్తలు అనబడే వాళ్ళు వారివారి ఆధ్యాత్మిక సందేశాలని అందించటానికి మాత్రమే పరిమితంగా మాట్లాడితే బాగుంటుంది. తెలిసీ తెలియకుండా ప్రతివిషయంలోనూ వ్యాఖ్యానించటం చాలా తప్పు.

తెలిసీ తెలియని విషయాల్లో ఈ‌ ఆధ్యాత్మిక వేత్తలు తలకాయ దూరుస్తూ ఉండటానికి కారణం ఏమిటో?


ఈ  అధ్యాత్మిక వేత్తలకి చాలా అనుసరణ (following) ఉంటుంది.  ఆ కారణంగా వాళ్ళు తరచూ ధైర్యంగా అన్ని విషయాల మీదా మాట్లాడతారు.  ఒక వేళ తమ మాటలు వివాదం రేకెత్తించినా ఇబ్బంది లేదు. సినిమాకి negative talk  కూడా మంచి publicity అవుతుందన్న మాట ఒకటి మనకు తెలుసు.  అలాగే, తమ వ్యాఖ్యానాలతో వివాదాలు వస్తే ఈ ఆథ్యాత్మిక వేత్తలకీ గురువులకీ ప్రచారం పండుతుందన్న మాట.  ఏ వివాదం లేదనుకోండి. తప్పో ఒప్పో జనం వింటున్నారు కాబట్టి ఈ వేత్తలు దర్జాగా తమతమ బోధల్ని విస్తరించుకుంటూ పోతారు,  తమకు ఏ‌ మాత్రమూ సరైన అవగాహన లేని రంగాల్లోకి కూడా.

ఇప్పుడు, ఈ సద్గురుగారి ప్రవచనం చూద్దాం.


మీరు మధుమేహ(డయాబెటిస్) వ్యాధిగ్రస్తులైతే చక్కెరతో మీకు సమస్య కాదు, మీ ప్యాంక్రియాస్(క్లోమ గ్రంథి) సరిగా పనిచేయడం లేదు, అంతే! 

చూడండి, ఈ‌ మాటల్లో కొత్తదనం ఏముంది?  క్లోమగ్రంథి సరిగా పనిచేయక పోవటంతో మధుమేహం వస్తుందని నేటి వైద్యశాస్త్రానికి తెలియదని ఈ సద్గురుగారి అభిప్రాయమా?  అదే చెప్తారు చూడండి.

అల్లోపతి (ఇంగ్లీష్) వైద్యంలో ప్యాంక్రియాస్‌ను ఎలా ఉత్తేజపరచాలో వారికి తెలియదు.

అల్లోపతీ అని పిలిచే ఆధునిక వైద్యంలో క్లోమగ్రంథిని ఉత్తేజపరచటం మీద తగిన శ్రధ్ధ పెడతారు.  ఇంకా ఈ విషయంలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు.

అల్లోపతి పైపై లక్షణాలనే చికిత్స చేస్తుంది. వైద్యులు మీ వ్యాధి లక్షణాలకే చికిత్స చేస్తారు.

అ మాట పూర్తిగా నిజంకాదు.  అసలు ఈ‌ ఆరోపణను చేసింది హోమియో వైద్యవిధానాన్ని కనిపెట్టిన హానిమన్ అనే వైద్యుడు.  అదీ రెండున్నర శతాబ్దాలకు పూర్వం. ఆయన గురించీ ఆ వైద్యం గురించీ హోమియో పతీ టపా లో చదవండి. అప్పటి సంగతి ఏమో కాని ఆ తర్వాత ఆధునిక వైద్యం చాలా చాలా అభివృధ్ధి సాధించింది.

యోగాలో మధుమేహ వ్యాధిని చాలా మౌలికమైన సంక్షోభంగా గుర్తిస్తాము. దానిని తేలికగా తీసుకోము. అసలు శరీర వ్యవస్థే దెబ్బతింటోందని, అందుకే వ్యాధి వస్తోందని గుర్తిస్తాము.

ఆనందమే. కాని శరీరవ్యవస్థ దెబ్బతినటం వల్ల మధుమేహం రావటం లేదు.  అది వచ్చాక శరీరంలోని వ్యవస్థలు దెబ్బతింటున్నాయి.  అది రావటానికి కారణం మాత్రం క్లోమగ్రంథి సరిగా పనిచేయకపోవటం.  మొత్తం వ్యవస్థ పని చేయక పోవటం కాదు.

డయాబెటిస్‌ను ఒక వ్యాధిగా కాక, అది శరీరంలోని ప్రాణశక్తి వ్యవస్థ దెబ్బతినడం మూలంగా వచ్చిందని గ్రహించి, దానిని సరిచేయడం వల్ల అది నయమౌతుంది. అందువల్ల మనుషులు తమ శక్తి వ్యవస్థను బాలెన్స్ చేయడానికి కొంత యోగ సాధన చేయడానికి ముందుకు వస్తే అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

అసలు ఈ‌ వాక్యాలు ఏం చెబుతున్నాయో గమనించారా?  ప్రాణశక్తి అనే వ్యవస్థ ముందు దెబ్బతింది.  కాబట్టి మధుమేహం వచ్చింది.  యోగాతో ఈ‌ ప్రాణశక్తిని బాలెన్సు చేయవచ్చును. అందుచేత, యోగసాధన చేసి మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయట పడండి.  ఇదీ‌ చివరకు సద్గరుగారి సలహా.

ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక వేత్తగారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలీ అంటే,

- తమకు మధుమేహం గురించి ఆధునిక వైద్యం పేరుతో‌జరుగుతున్నది వట్టి దగా అని తెలుసు కోవాలి.

- మధుమేహానికి ఆధునిక వైద్యం చేస్తున్న డాక్టరు దగ్గరకు వెళ్ళ కూడదు.

- మధుమేహానికి అంటూ ఆధునిక వైద్యం ఇచ్చిన మందులు వాడ కూడదు. అవి అదుపు చేయగలవేమో కాని వ్యాధిని నయం చేయవు.

- యోగా సాధన మంచిది మధుమేహానికి.  అలాగే అన్ని దీర్ఘవ్యాధులకీ, అదే పరమ వైద్యం.  చివరికి కాన్సరు కైనా సరే.

- మంచి యోగా గురువుని ఆశ్రయించాలి.

- శ్రధ్ధగా యోగా సాధన చేయాలి.


 తగ్గిందా మధుమేహం?  చూసారా మరి గురువుగారు చెప్పినట్లే జరిగింది కదా?
 ఏమిటీ? మీ మధుమేహం తగ్గలేదా? మీ ప్రారబ్ధకర్మ చాలా గట్టిది.  అంతా మీ కర్మ.

ఇదండీ చివరికి తేలింది.

చాలా కాలం క్రిందట నా స్నేహితుడు ఒకతను, గోధుమగడ్డితో సంపూర్ణారోగ్యం అని చదివి,  తెగ మేసాడండీ‌ ఆ గడ్డిని.  ఫలితంగా జబ్బుపడి డాక్టర్ల చుట్టూ తిరిగాడు కొన్నాళ్ళ పాటు.

అలాగే శ్రీమంతెన రాజుగారు ఆరోగ్యం కోసం సలహాలు ఇస్తూంటారు.  టీవీల్లోనూ వస్తారు. చాల పుస్తకాలూ ఉన్నాయి ఆయనవి.  చివరికి ఆయనే, తాను ప్రచారం చేస్తున్న జీవనశైలి వల్లనే తీవ్రంగా జబ్బు పడ్డాడని చదివాను.  ఈ మధ్య  బాబా రాందేవ్ అని ఒకాహన తెగ హడావుడి చేస్తున్నాడు.  ఆయన ఒక క్వేక్ అన్నారో డాక్టరుగారు మొన్ననే.

ఈ‌ మధ్య అనేకానేక ఆయుర్వేదం మందులూ వస్తున్నాయి మధుమేహానికి సరైన వైద్యం ఇదే నంటూ.  ఒక్క విషయం గ్రహించండి.  మూలికలూ భస్మాలూ వాటితో తయారయ్యే ఈ ఆయుర్వేదం మందులు ఎలా పని చేసేదీ పరిశోధనల్లో ఎక్కడా ఋజువు లుండవు. చాలా మంది చేసేది, కేవలం‌ ప్రచారం నమ్మి వాడటమే!  కాని ఈ‌ ఆయుర్వేదం మందులూ, అల్లోపతీ డాక్టరుగారు ఇచ్చే‌ మందులూ‌ కలేసి వాడటం అంత క్షేమకరం కాదు.  ముఖ్యంగా మీ అల్లోపతీ డాక్టరుగారికి చెప్పకుండా ఆస్సలు వాడకూడదు.  ఈ మూలికల్లోని రసాయనాలకూ,  మీ డాక్టరుగారు ఇచ్చే మందుల్లోని రసాయనాలకూ మధ్య ఎలాంటి రాసాయనిక చర్యలు మీ పొట్టలో జరుగుతాయో ఎవరికీ ఏమీ తెలియదు.  మీదు మిక్కిలి అయిపోతే ఆందోళన పడటం కన్నా, ముందే మేల్కోండి.  జాగ్రత్త పడండి!

ప్రతిదానికీ ఈ మధ్య యోగా అని టైటిల్ ఒకటి తగిలించటం ఫ్యాషన్ అయిపోయింది.  అధ్యాత్మిక విద్యలో చెప్పే యోగానికి ఈ నియోయోగాలకీ ఏ సంబంధమూ లేదు.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే,  మీ ఆరోగ్యంతో మీరు ప్రయోగాలు చెయ్యకండి.  అవి తరచుగా వికటిస్తాయి.  వైద్య పరమైన పరిజ్ఞానమూ, అధికారమూ లేని వాళ్ళు చెప్పే వైద్యపరమైన సలహాలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలెయ్యండి.   అలాంటి సలహాలు ఇచ్చే మహనుభావులకి వీలైనంత వరకూ, చాలా దూరంగా ఉండండి.

15 కామెంట్‌లు:

  1. మధుమేహం మన జీన్స్ మూలాన వస్తుంది కూడా. అంటే నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా మా తాతల తండ్రుల జీన్స్ వల్ల నాకూ మధుమేహం రావొచ్చు. అప్పుడు యోగా కాస్త కంట్రోల్ చేయడనికి పనికిరావచ్చేమో. నేను కూడ ఆ పోస్ట్ చదివి నవ్వలేకుండ ఉండలేకపోయాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుమేహం జీన్స్ వల్ల వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అది ప్రజల అవగాహనలోకి కూడా వచ్చింది. భారతీయులతో పోల్చుకుంటే ఫ్రెంచ్ వాళ్ళు చాలా ఎక్కువగా వెన్న వాడతారు. కాని వాళ్ళల్లో చాలా తక్కువగా మధుమేహం కనిపిస్తుంది.

      ముందు ఆ టపా చదివి నాకూ నవ్వు వచ్చింది. కాని దేశంలో పరిస్థితి చూడండి. ఆయుర్వేదం కూడా corporate సంస్థల చేత్ల్లోకి పోయింది. హోమియో వైద్యమూ అంతే - పోజిటివ్ హోమియోట! నెగెటివ్ కూడా ఉంటుందన్న మాట. బాబూరావ్ పటేల్ అన్న ఆయన హోమియో సిథ్థాంతానికి విరుధ్ధంగా హోమియో మందుల్ని కలిపి పేటెంట్ ఔషదాలు చేసి అమ్మటం మెదలు పెట్టాక దశాబ్దాలక్రితం, అది క్రమంగా కాలక్షేప వైద్యమూ, కార్పొరేట్ వైద్యమూ ఐపోయింది. ఒక ఖరీదైన హోమియో వైద్యశిఖామణి మా బాబాయిగారికి అక్షరాలా ఇరవై ఆరు హోమియో మందులు ఒకే సారి టైం టెబుల్ వేసి వాడిస్తుంటే అవి మానిపించాక ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. బోలెడు మధుమేహం మందులు మార్కెట్ లోకి వచ్చి సొమ్ము చేసుకుంటున్నాయి - ఒక్క దాని మీదా సాధికారకమైన సమాచారం లేదు. ఈ దోపిడికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రచారం చేస్తూ స్వాములోర్లు కూడా! అందుకే చిరాకు పుట్టి, జనక్షేమం కోసం అనుకోండి, మనశ్సాంతి కోసం అనుకోండి మనస్సులో ఉన్న నాలుగూ బయటికి చెప్పేసాను.

      తొలగించండి
  2. ఒక లెవెల్ వచ్చాక వీళ్ళందరూ "నేను ఏది చెప్పినా జరిగిపోతుంది" అంకుంటారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. లేకపోతే మెల్ల మెల్లగా ఈ ప్రవచనాలు ఎందుకు ప్రకోపిస్తున్నాయంటారు? పేర్లు కూడ కొంచెం వింతే. ఈయ పేరు చూడండి - "జగ్గీ వాసుదేవ్" అని రాస్తారు. హ్మ్మ్ ఏమి వింత? వివేకానందులు గానీ, శివానందులు కానీ ఇలాగ కుదించుకుని 'వివ్', "సివ్" అని రాసుకున్నారా? భలే ఉంటున్నారు ఈ మధ్య స్వాములందరూ.

    హైద్రాబాదులో ఇప్పుడు పెద్ద హోమియోపతి వైద్యులందరూ మందు పేరు చెప్పరు. ఎందుకంటే పేరు చెప్తే మళ్ళీ వాడి దగ్గిరకి వెళ్ళరు కదా? ఓకాయన రాసేరు గొంతుక దగ్గుకి కడుపులో మందు ఇచ్చాను తగ్గిపోయింది అని. అది కాస్త బుర్ర ఉన్నవాడెవడైనా చెప్పగలడు. గేస్ ట్రబుల్ మొదలయ్యేముందు దగ్గు, కఫం మొదలౌతాయి. దినికి డాక్టర్ దగ్గిరకి కూడా వెళ్ళక్కర్లేదు. గూగిల్ ని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ఎం బి బి ఎస్ లు నాడి కూడ సరిగ్గా చూడలేరు ఎందుకంటే డొనేషన్ కాలేజీల్లోంచి బయటకొచ్చేరు మరి. పెద్ద డాక్టర్ల దగ్గిరకి వెళితే వాళ్ళు వాళ్ళ తాహతుని బట్టి ఛార్జ్ చేస్తారు, లేకపోతే ఆ పెద్ద బిల్డింగులకీ నర్సులకీ డబ్బులెక్కడ్నుంచి వస్తాయి?

    మందుల సంగతికేమి లెండి, సన్యాసం కూడా కార్పొరేట్ అయిపోతోంది. Whither goes my country?

    These days the slogan "mera bharat mahan" makes no meaning!

    రిప్లయితొలగించండి
  3. అల్లోపతి (ఇంగ్లీష్) వైద్యంలో ప్యాంక్రియాస్‌ను ఎలా ఉత్తేజపరచాలో వారికి తెలియదు.
    -------------------------------------------------
    ఈ సద్గురుగారి ప్రవచనం .అది తప్పు సమాచారం. WebMD నుండి type-2 డయబెటీస్ కి వాడే మందుల గురించి ఇస్తున్నాను.
    http://diabetes.webmd.com/daily-diabetes-control-7/oral-medications

    Types of Diabetes Pills

    Diabetes pills are grouped in categories based on type. There are several categories of diabetes pills -- each works differently.

    Sulfonylureas. These diabetes pills lower blood sugar by stimulating the pancreas to release more insulin. The first drugs of this type that were developed -- Dymelor (acetohexamide), Diabinese (chlorpropamide), Orinase (tolbutamide), and Tolinase (tolazamide) -- are not as widely used since they tend to be less potent and shorter-acting drugs than the newer sulfonylureas. They include Glucotrol (glipizide), Glucotrol XL (extended release), DiaBeta (glyburide), Micronase (glyburide), Glynase PresTab (glyburide), and Amaryl (glimepiride). These drugs can cause a decrease in the hemoglobin A1c (HbA1c) of up to 1%-2%.

    Biguanides. These diabetes pills improve insulin's ability to move sugar into cells especially into the muscle cells. They also prevent the liver from releasing stored sugar. Biguanides should not be used in people who have kidney damage or heart failure because of the risk of precipitating a severe build up of acid (called lactic acidosis) in these patients. Biguanides can decrease the HbA1c 1%-2%. An example includes metformin (Glucophage, Glucophage XR, Riomet, Fortamet, and Glumetza).

    Thiazolidinediones. These diabetes pills improve insulin's effectiveness (improving insulin resistance) in muscle and in fat tissue. They lower the amount of sugar released by the liver and make fat cells more sensitive to the effects of insulin. Actos (pioglitazone) and Avandia (rosiglitazone) are the two drugs of this class. A decrease in the HbA1c of 1%-2% can be seen with this class of oral diabetes medications. These drugs may take a few weeks before they have an effect in lowering blood sugar. They should be used with caution in people with heart failure. In fact, the FDA has restricted Avandia for use in new patients only if they can't control their blood sugar on other medications and are unable to take Actos. Current users can continue Avandia if they choose to do so. All patients using Avandia must review and fully understand the cardiovascular risks.

    రిప్లయితొలగించండి
  4. సద్గురు, ఉపన్యాసం లొ చెప్పిన ఒక ముక్కను పట్టుకొని అనాలిసిస్ చేయటం అవివేకం. ఆయన తండ్రి కూడ డాక్టరే. ఆయన నాలుగు యోగసనాలు చెప్పటనికి మూడు రోజులు, రోజుకి 8గంటల చొప్పున తరగతి తీసుకొంటాడు. ఆ సమయం లో ఎన్నొ విషయాలు చెప్తుంటాడు. అందులో చెప్పిన రెండు నిముషాల మాటలు ఆ టపా. పేపర్ లో చదివి , ఎదొ యోగా గురించి తెలుసికొనాలనుకొనే వారికి సద్గురు లాంటి వారవసరం లేదు. వాళ్లకు నచ్చింది చేసుకోవచ్చు. ఇక ఇంగ్లిష్ వైద్యానికి వస్తె, దానిని గుడ్డిగానమ్మటానికి చెవులో పువ్వులు పెట్టుకొలెదు. ఓక్కొక్క డాక్టర్ గజనీ మహమ్మద్. పేషంట్ల నుంచి డబ్బులు కొల్లగొట్టటం లొ పి హెచ్ డి చేసారు. చాలా మందీఇ వైద్యం కాదుగద, రోగ నిద్దారణ కూడా చేయలేరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ అజ్ఞాతగారి వ్యాఖ్య అసమంజసంగా ఉంది. సహేతుకమైన అభ్యంతరాలు వ్యక్తం కాని పక్షంలో రేపు ఈ వ్యాఖ్యను తొలగిస్తాను.

      తొలగించండి
    2. శ్యామలీయం గారు

      పై వ్యాఖ్యలో వ్యక్తిగత దూషణ లేదు . కాబట్టి ఉండనివ్వండి. ఎవరి అనుసరణ ప్రోత్సాహాలతో అటువంటి గురువులు కుక్క గొడుగుల్లా పుట్టుకొస్తున్నారో వారి భావాలు ఉంటే నే కదా మీరెందుకు వ్రాసారో స్పష్టం అయ్యేది.

      ఇక మంతెన గారు చెప్పిన బేసిక్స్ మంచివే, అవన్నీ ముందునుండీ ఉన్నవే. ఫ్రీగా మారుమూల ప్రాంతాలకు కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు అందించారు .అయనకు ఆదరణ , ఆదాయం పెరిగిన నేపధ్యంలో కొంత పంథా మారింది. ఆయన పద్దతులు విపరీతంగా పాటించే వారికి వచ్చే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ , ప్రమాదాలు కూడా కలిపి చర్చిస్తే ఇంకాస్త మంచే జరిగి ఉండేది .

      తొలగించండి
  5. శ్యామలీయం గారూ,
    పెద్దలు మీ నుంచీ ఇలాంటి టపా నన్ను చాలా ఆశ్చర్య పరిచింది. మీరు రాసిన చాలా విషయాలతో నేను విభేదిస్తాను. ఆ వివరాలు ఒక టపాగా వారాంతంలో రాయగలను. గమనించగలరు.

    -కార్తీక్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా వ్రాయండి.
      అయితే, మీ‌ టపా నా దృష్టినుండి తప్పిపోకుండా ఉండేందుకు గాను ఇక్కడ మీరొక గమనిక ఉంచితే నాకూ, ‌ఈ‌ చర్చ పట్ల ఆసక్తి ఉన్న ఇతరులకు సదుపాయంగా ఉంటుంది.

      తొలగించండి

  6. అబ్బా,

    ఇదేదో బాగుందండీ ! టపా పై కామెంటు మరో టపా అయితే, ఆ టపా పై విబెధం మరో టపా ! వావ్ మంచి రసవత్తరమైన టపాలు ఇక చూడ వచ్చు !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. మీ టపా బాగుంది, నవ్వు తెప్పించింది. బాబా రాందేవుడికి కన్ను కొట్టడం ఆపే యోగాసనం ఇంకా దొరికినట్టు లేదు.

    రిప్లయితొలగించండి
  8. ఆయనకు కన్ను కొట్టు కోవడం, పుట్టుకతో వచ్చిన ఉన్న శారీరక లోపం అయి ఉండవచ్చు. దానివలన అతనికి ఏమాత్రం ఇబ్బంది లేకపోవచ్చు, కాని ఆ లోపాన్ని వెక్కిరించే మీకు పెద్ద మానసిక రోగం ఉంది, పనిలేక బ్లాగు డాక్టర్ రమణ గారికి చుపించుకోండి .

    రిప్లయితొలగించండి
  9. పెద్దలు శ్యామలీయం గారికి నమస్కారం
    జగ్గీవాసుదేవ్ గారి ఉపన్యాసం ఒకటి పత్రికనుంచి నాబ్లాగ్ లో పోస్ట్ చేశాను . వినదగు నెవ్వరు చెప్పిన ... అనే సూక్తి ప్రకారం మనం చదివినవన్నింటినీ గుడ్డిగా నమ్మం . వినటంలో తప్పూ లేదు. ఇక వైద్య విధానాలపై మీ స్పందన కొద్దిగా ఆవేశంగా ఉన్నట్లనిపిస్తున్నది. వివరంగా వ్రాద్దామంటే నేను బెడ్ రెస్ట్ లో ఊండటం వలన కుదరటం లేదు. కాలుకు దెబ్బతగిలి శస్త్రచికిత్స చేశారు . కోలుకున్నాక గానీ లేక మీరు ఫోన్ లో కలిసినప్పుడు గాని మాట్ళాడతాను . ఆయన వ్రాసినవి ,మీరు వ్రాసినవి ఇంకోసారి పరిశీలనగా చూడండి జైశ్రీరాం .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వినదగు నెవ్వరు చెప్పిన అన్న శతకకారుడి నుడి సత్యమే. కాని, ఇంకా జనసామాన్యంలో పేరుపడ్డ వాళ్ళంతా మేథావులనీ, అచ్చైనదంతా వాస్తవమనీ భ్రమపడే వారి సంఖ్య తదితరులకన్నా హెచ్చుగా ఉంది. కాబట్టి, ఇతరులకు వినిపించే ముందు సాధ్యమైనంతవరకూ ఆ శతకకారుడే చెప్పినట్లు, వేగపడక వివరింపదగును. నా స్పందనలో కొద్ది ఆవేశం ఉన్న మాట వాస్తవమే. కాని మీ‌ టపాను రెండు మూడు సార్లు చదివి ఆలోచించుకున్నాకే వ్రాసాను నా స్పందనని. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఈ విషయంపై మనం తర్వాత మాట్లాడుకోవచ్చును.

      తొలగించండి
  10. If a person regulary practises Yoga gradually his/her health gradually shows improvement.

    I do not know about his personal charcter not a supporter of Baba Ramdev but he practised Yoga, cured his health problem and teaching Yoga to others.

    As a child Baba Ramdev suffered from paralysis. According to some friends Yoga was the medicine to releave him from paralysis. That is one of the reason that Ramdev Baba wants each human being to know and adpot Yoga.

    http://yogagururamdev.com/

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.