9, ఆగస్టు 2013, శుక్రవారం

ఏ మయ్యా ఓ రామజోగీ ఏ ఊరయ్యా నీది

ఏ మయ్యా ఓ రామజోగీ 
    ఏ ఊరయ్యా నీదీ
ఏమో నిన్ను ఎరిగిన వారు 
    ఎవరూ‌ లేరనిపిస్తోందీ

బైరాగి వలే వేషం‌ కట్టీ
    భేషుగ్గానే‌ ఉన్నావూ
దూరం నుండీ వచ్చావేమో
    ఊరి కోవెలలొ విడిసేవా ॥ఏ మయ్యా॥    

దిక్కుమాలిన సంసారమనే
    టక్కరి జబ్బు తగులుకుని
ఇక్కడి ప్రజలు వైద్యం లేక
    చిక్కులు పడుతున్నారయ్యా ॥ఏ మయ్యా॥

ఘన వైద్యులు  బైరాగుల్లోనే
     కనబడతారని అంటారే
మనకేమైనా వైద్యపు గీద్యపు
      పనితనముందా చెప్పండీ ॥ఏ‌ మయ్యా॥

ఎవరికి అంతు చిక్కని జబ్బు
    ఇక్కడ ఎంతో‌ ముదిరింది
భవవైద్యానికి మందులు నీకు
    బాగా తెలుసా చెప్పు మరి  ॥ఏ మయ్యా॥

5 కామెంట్‌లు:


  1. ఇదిగో నయ్యా శ్యామ యోగి,
    భవవైద్యానికి మందులు లేవయా
    మునిగినా తేలినా నను మరువకయ్యా
    అదియే నిక్కచ్చి గ మందయ్యా !


    రిప్లయితొలగించండి
  2. రామజోగి అర్థం వివా రించాగాలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యోగి అన్నమాటకు జోగి అన్నది వికృతి. కాబట్టి రామజోగి అంటే రామయోగి అన్నమాట. అంటే రామతత్త్వంలో రమించే యోగి అని తాత్పర్యం.

      తొలగించండి
    2. నేను కొన్ని సందేహాలు మీ ద్వారా మీ ద్వారా తెలుసుకోవలెను కుంటున్నాను...దయ చేసి మీ ఫోన్ నంబరు ఇవ్వగలరు..లేదా నాకు ఫోన్ చేస్తారని ఆశిస్తున్నా...9676103925

      మీ విశ్వాసపాత్రులు
      కొంగల రాంప్రసాద్

      తొలగించండి
    3. ప్రసాద్ గారూ, అనివార్య కారణాల వలన బ్లాగులోని కొన్నాళ్ళుగా తరచుగా రావటం లేదు. మీ వ్యాఖ్యను ఆలస్యంగా చూసినందుకు క్షంతవ్యుడను. మీతో ఇప్పుడు మాట్లాడినందుకు ఆనందంగా ఉంది. ఈ కీర్తనలు మీకు నచ్చుతున్నందుకు చాలా చాలా సంతోషం.

      తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.