17, ఆగస్టు 2013, శనివారం

ఏమి దుర్గతి పట్టె నోయమ్మా, ఓ భారతాంబా!

ఈ రోజున  యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం కుదిరింది అని ఒక  వార్త ఒక బ్లాగు టపా వచ్చింది.  దానికి నా స్పందన.


ఏమి దుర్గతి పట్టె నోయమ్మా, ఓ భారతాంబా
ఏమి దుర్గతి పట్టె నోయమ్మా, ఇక ముందు నీకు
ఎంత దుర్గతి పట్ట నుందమ్మా!

అక్కటా  చెడు కాలమైతే
కుక్కమూతి పిందెలంటా

ఒక్కొటొక్కటి పుట్టుకొచ్చీ
దిక్కులేక చెట్టు కూలేను
కుక్కమూతి పిందెలట్టీ
ఒక్కొరొక్కరొక్కరు గద్దెకెక్కేరా?  ॥ఏమి దుర్గతి॥

పేరుకేమో ప్రజలు ప్రభువులు
వీరి పేరున ధనమదాంధులు
పేరుమోసిన నేరగాండ్రూ
వీరు వారని లేదు దొంగలు
ఔరా ఈ‌నాడు పాలకు 
లైరి ప్రజలకు యేమి గతి యింక  ॥ఏమి దుర్గతి॥

అష్టకష్టాలోర్చిపోరగ
దుష్టపాలన అంతరించి 
షష్టిపూర్తి నాటికే కడు
దుష్టనాయకులన్నిమూలల
కష్టపడి సాధించు కొన్నది 
నష్టపడితే‌ తాళ లేమమ్మా  ॥ఏమి దుర్గతి॥