శ్రీరామచంద్రూవారికి యజ్ఞోపవీతం సమర్పించిన తరువాత మనం చేయవలసిన ఉపచారం ఆయనకు గంధం ఇవ్వటం. అంటే స్వామి శరీరానికి సుగంధం అలదటం అనే సేవ.
గంధం
కం. దీనికి మించిన గంధము
కానంబడ దుర్వి మీద కావున దయతో
ఈ నా భక్తి సుగంధము
చే నందుము రామచంద్ర సీతారమణా
తాత్పర్యం. భగవంతుడి సృస్టిలో ఉన్న ఈ భూప్రపంచంలో ఉన్నాం మనం. ఇక్కడ ఉన్న అన్ని పరిమళభరితమైన వస్తువుల్లోనూ ఉత్తమోత్తమమైనది భగవద్భక్తి అనే సుగంధం. సుగంధం అనే వస్తువు యొక్క లక్షణం మనోహరమైన పరిమళంతో మనస్సుకి ప్రీతికలిగించటం కదా. భగవంతుడికి భక్తుడివ్వగలిగిన అత్యంత ప్రీతికరమైన వస్తువు భక్తి. అందుచేత మనం స్వామితో, ఓ స్వామీ సీతారమణా, ఈ నా భక్తి అనేదే భూప్రపంచంలో నేను నీకు ఇవ్వగలిగిన అత్యంత సుగంధపూరితమైన మైసేవ. దీనిని దయతో స్వీకరించండి అని ప్రార్థిస్తున్నా మన్నమాట.
(ఆగష్టు 2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.