8, ఆగస్టు 2013, గురువారం

పాహి రామప్రభో - 194

శ్రీరామచంద్రులవారికి నైవేద్యం సమర్పించుకున్న తరువాత మనం శ్రీవారికి తాంబూలం అందించాలి.

తాంబూలం

క. ఆకులుగా త్రిగుణంబులు
పోకలుగా మనసు బుధ్ధి పోడుములున్ చూ
ర్ణాకృతి నహ మొప్పంగను
మీకున్ తాంబూల మిత్తు మేలుగ రామా

తాత్పర్యం. ఓ‌ రామచంద్రప్రభూ. మీకు మేలైన తాంబూలం సమర్పించటానికి అనుమతి నివ్వండి.  నా త్రిగుణాలే తములపాకులుగా, నా మనస్సు, బుధ్ధి అనేవే పోక చెక్కలుగా, నేను అన్న భావననే చూర్ణం చేసి అదే సున్నంగా మీకు తాంబూలం సిథ్థం చేసాను.  దయచేసి నేనివ్వ గలిగింతలో ప్రశస్తమైన యీ‌ తాంబూలాన్ని గ్రహించి అనుగ్రహించండి.

(ఆగష్టు 2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.