17, ఆగస్టు 2013, శనివారం

పాహి రామప్రభో - 200

శ్రీరామచండ్రులవారికిమనం చేస్తున్న మానసిక పూజ పూర్తిచేసుకున్నాం.   పూజాఫలాన్ని కూడా బహగవదర్పణం చేయటం తో మన సంకల్పం సుసంపన్నం అవుతుంది.

అర్పణం

క. మానసికంబుగ చేసిన
ఈ నా చిరుపూజ నీకు హృదయంగమమే
యౌనని తలచెద రామా
దీని మహాఫలము గొనుము దీవన లిమ్మా


తాత్పర్యం.  ఓ శ్రీరామచంద్రప్రభూ! ఈ విధంగా నా మనస్సులోనే నీకు నేను చేసుకున్న చిరుపూజ నీ మనస్సుకు ఆనందం కలిగిస్తుందనే తలుస్తున్నాను. ఇలా నిన్ను పూజించుకోవటం మహాపుణ్యఫలాన్ని ఇస్తుందని నాకు తెలుసు.  ఆ ఫలాన్ని కూడా నీకే అర్పించుకుంటున్నాను.  దయచేసి అదికూడా స్వీకరించి అనుగ్రహించు.  నన్ను దీవించవయ్యా. అది చాలు నాకు.

(ఆగష్టు 2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.