7, ఆగస్టు 2013, బుధవారం

పాహి రామప్రభో - 193

శ్రీరామచంద్రస్వామికి దీపదర్శనం అనే ఉపచారం తరువాత మనం నైవేద్యం సమర్పించుకోవాలి.

నైవేద్యం
కం. నాదని యేమున్నది నీ
పాదంబుల చెంతనుంచ భక్తుడ నీ వెం
తో దయనిచ్చిన దీని ని
వేదించెద జీవితమును వేదవిహారా


తాత్పర్యం. ఓ శ్రీరామచంద్రప్రభూ!  నాదని ప్రత్యేకంగా యేమీ‌ లేదు కదా.  అంతా నీవు ప్రసాదించినదే.  అందు చేత, ఇదిగో ఇది నేను నీ‌ పాదాల వద్ద నివేదించు కుంటున్నాను అని చెప్పి ఇవ్వగలిగింది ఏదీ‌ కనబడటం లేదు.  అందు చేత, నీ విచ్చినదే అయినా నా జీవితాన్నే నీకు నివేదించుకుంటున్నాను.  నేకు నేను ఇవ్వగలది అంత కంటే శ్రేష్ఠమైనది మరేమీ లేదు కదా.  దయచేసి స్వీకరించండి.

(ఆగష్టు 2013)