10, ఆగస్టు 2013, శనివారం

పాహి రామప్రభో - 198

శ్రీరామచంద్రులవారికి నమస్కారములు చేసుకున్నాక మనం ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి.

ప్రదక్షిణం

క.  నీ చుట్టు నేను తిరుగుట
నా చిత్తము గోరు టదియె నా భాగ్యము నే
డీ చిన్న పూజగైకొని
ప్రోచిన నది చాలు రామభూవర నాకున్

తాత్పర్యం.  ఓ‌శ్రీరామచంద్ర భూనాథా,  నా మనస్సు ఎప్పుడూ నీ చుట్టే తిరుగుతూ‌ ఉంటుంది.  అది నా భాగ్యం అనుకుంటున్నాను.  నా ఈ‌ చిన్న పూజను స్వీకరించి నన్ను సంరక్షించు. అది నాకు చాలు.  నాకు మరేమీ‌ కోరిక లేదు.

(ఆగష్టు 2013)