శ్రీరామచంద్రప్రభువులకు మనం నూతన వస్త్రాలు సమర్పించుకున్నాం. ఇప్పుడు మనం స్వామివారిని నూతన యజ్ఞోపవీత సమర్పణం చేయాలి యజ్ఞోపవీతం అంటే జంధ్యం.
యజ్ఞోపవీతం
కం. ఇది నా నవనాడులతో
ముదమున సమకూర్చి బ్రహ్మముడి యనగా నా
హృదయం బమరించిన యది
సదమల ముపవీత మయ్య జానకిరమణా
తాత్పర్యం: ఓ జానకీపతీ, శ్రీరామచంద్రా, నా హృదయమే బ్రహ్మముడిగా, నా నవనాడులే ఉపవీతపు పోగులుగా నీకు యజ్ఞోపవీతం సమర్పించుకుంటున్నాను. నీయందలి భక్తి కారణంగా పునీతమైన నా హృదయమూ నవనాడులతో యేర్పడిన ఇది మిక్కిలి నిర్మలమైన శ్రేష్ఠమైన యజ్ఞోపవీతం. దీనిని మీరు స్వీకరించవలసినది.
(ఆగష్టు 2013)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.