4, ఆగస్టు 2013, ఆదివారం

పాహి రామప్రభో - 190

శ్రీరామచంద్రులవారికి గంధం అలదిన తరువాత మనం పుష్పసమర్పణం చేయటం‌ తరువాత చేయవలసిన ఉపచారం

పుష్పం

కం. పంచేంద్రియ సంపుటియే
పంచదళంబులుగ భక్తి పరిమళముగ నా
మంచి హృదయ సుమము సమ
ర్పించెద  దయచేసి స్వీకరించవె రామా


తాత్పర్యం. శ్రీరామచంద్రప్రభూ, నేను నీకు నా హ్యదయాన్నే దివ్యపుష్పంగా సమర్పించుకుంటున్నాను. దీనికి చక్కగా నా పంచేద్రియములనే ప్రశస్తమైన రేకులూ,  భక్తి అనే‌ పేరుగల ఎంతో మనోహరమైన పరిమళమూ ఉన్నాయి. ఇంతకంటే మంచి పుష్పం లేదూ, ఇది చాలా ఉత్తమోత్తమమైన పుష్పం అని నీకు వినయంగా సమర్పించుకుంటున్నాను.

(ఆగష్టు 2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.