9, ఆగస్టు 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 197

శ్రీరామచంద్రులవారికి తాంబూలం సమర్పించుకున్నాక మనం చేయవలసిన ఉపచారం నమస్కరించటం

నమస్కారం

క. ఈ కొలది పూజ గైకొని
నాకు ప్రసన్నుండవగుము నా తండ్రీ‌ రా
మా కరుణామృత సాగర
నీకు నమస్కారశతము నీరజనయనా

తాత్పర్యం.  ఓ‌ శ్రీరామచంద్రప్రభూ, కరుణామృత సముద్రుడా. ఏదో‌ నాశక్తి కొలదీ‌, భక్తికొలదీ చేసీ యీ కొంచెపు పూజను దయచేసి స్వీకరించవలసినది. నాకు ప్రసన్నుడవు కావలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఓ కలువకన్నుల దేవరా, నీకు మనసా వంద నమస్కారాలు చేస్తున్నాను.

(ఆగష్టు  2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.