31, ఆగస్టు 2021, మంగళవారం

అందముగా పలుకరేల హరినామములు

అందముగా పలుకరేల హరినామములు
ముందు ముందు మీకవి ముక్తిసోపానములు

హరినామము లన్నియు నందమైనవే కదా
హరినామము లన్నియు నతిమధురమేగా
మరియంత యందమైన మధురనామంబులను
మురియుచును పలుకరే ముద్దుముద్దుగా

మధుసూదనా యనుచు మధురముగ పలుకరే
మధురాతిమధురముగ మాధవా యనరే
అధరములా తేనెబా వంచులా యనిపించ
సుధామధురహరినామశోభ చెలగగా

రామరామ యనుటే ప్రాణమైన రసనపై
నామమెంత అందముగ నాట్యమాడేనో
స్వామి యెంత మెచ్చేనో చక్కగా మోక్షమే
ప్రేమతో నిచ్చేనో పిలువు డందముగా



1 కామెంట్‌:

  1. చాలా బాగా వ్రాసావు..వాస్తవం కూడా ఇది
    హరినామం మించింది ఏమున్నది..
    భవబంధాలను పారద్రోలడానికి..

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.