1, ఆగస్టు 2021, ఆదివారం

కోటి పను లున్న గాని

కోటి పనులున్న గాని గోవిందస్మరణము
మాటికిని చేయువాడె మతిమంతుడు

లేనిపోని పనులు చేత లేనివా డుండునా
మానరాని పనులచును మరచునా హరిని
జ్ఞానవంతు డెవడంటే సర్వాత్మనా హరి
ధ్యానమున్న వాడెపో ధారుణిపైన

హరే రామ హరే కృష్ణ యని చాల చక్కగా
నిరంతరము హరినామ స్మరణము చేయు
పరమభాగవతుడగుచు హరికి చేరువైన
నరుడెపో తరించును నమ్మకంబుగ

గోవిందా గోవిందా కోదండరామ యని
గోవిందా గోవిందా గోపాలకృష్ణ యని
గోవిందా యనుచు యెట్టి గొంకులే కెప్పుడును
భావించు వాడెపో భవమును దాటు