కుటుంబ సభ్యులు అందించిన వివరాలు:
శ్రీ జై గొట్టిముక్కల గారు ఈనెల ఒకటవ తారీఖున ఉదయ సమయంలో పరమపదించారు.
ఈ విషాదవార్త నాకు ఇప్పడే తెలిసింది.
కొన్నాళ్ళుగా నేను బ్లాగుల్లో చురుకుగా లేక, జై గారు ఈమధ్యన బ్లాగుల్లో కనబడటం లేదన్నది ఆలస్యంగా నిన్ననే గమనించాను.
వెంటనే వారికి ఈమెయిల్ పంపాను.
కానీ స్పందన రాలేదు.
వారు సాధారణంగా నాకు వెంటనే స్పందిస్తారు. కాని జవాబు రాకపోవటం ఆదుర్దాను పెంచింది.
కొద్ది నిముషాల క్రిందట ఆయన నెంబరుకు ఫోన్ ఛేస్తే వారి సతీమణి గారు ఈదుర్వార్తను తెలిపారు.
జైగారు ఈ జనవరి నుండి కాన్సర్ కారణంగా అస్వస్థతకు గురియై ఉన్నారట. అస్పత్రిలో చికిత్సపొందుతూ ఉన్నారట.
బ్లాగు ప్రపంచంలో మంచి విషయపరిజ్ఞానమూ విశ్లేషణాపాటవమూ కలవారిగా జైగారికి మంచి పేరుంది.
ఇక ఆయన మనకు దూరం కావటం పెద్దలోటే.
జై గారి ఆత్మకు ఉత్తమగతులు కలుగు గాక!
మంచి మిత్రుడు, ఎన్నో విషయాలను ఆయన నుండి నేర్చుకున్నాను. శ్యామలరావు గారి ద్వారా ఈ వార్త తెలియగానే చాలా బాధపడ్డాను. జోహార్లు 🙏
రిప్లయితొలగించండికొండలరావు గారు,
తొలగించండిమీరు లోగడ శ్రీ జై గారిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. దయచేసి దానిని పునర్ముద్రించండి.
తప్పకుండా సర్.
తొలగించండికొండలరావుగారు, నా సూచన మేరకు జై గారితో మీరు జరిపిన ముఖాముఖిని పునర్మిద్రించి నందుకు సంతోషం.
తొలగించండిJohar...Johar...
రిప్లయితొలగించండిఅయ్యో, ఒక మంచి పరిచయస్థుడిని కోల్పోయామే 🙁.
రిప్లయితొలగించండికొంత కాలంగా బ్లాగుల్లో కనబడక పోవడం నేనూ గమనించాను. ఇతరత్రా బిజీగా ఉండుంటారులే అనుకున్నాను గానీ ఇలా అస్వస్ధులై ఉన్నారని లేశమైనా అనుమానం కలగలేదు. నమ్మలేని దుర్వార్త.
జై గొట్టిముక్కల గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించుగాక 🙏.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
Such a bad news
రిప్లయితొలగించండి🙏🙏🙏
రిప్లయితొలగించండిఎలా జరిగింది?
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిHeart felt condolences to the bereaved
Family. Pray GOD his noble soul attain
Salvation.
మిత్రులు గమనించగలరు, ఈటపాలో జైగారి ఛాయాచిత్రాన్ని కొన్ని వివరాలను ఇప్పు పొందుపరచాను.
రిప్లయితొలగించండిI am sorry beyond words for your loss
రిప్లయితొలగించండినాకే కాదండి తెలుగుబ్లాగు ప్రపంచానికే వారు దూరంకావటం పెద్ద లోటు.
తొలగించండిఅయ్యో. ఆయనకు సద్గతులు కలుగు గాక.
రిప్లయితొలగించండిఅయ్యో..! చాలా విశాద కరమైన వార్త..! ఈ కొవిడ్ ఓ వైపు చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూనే ఉంది..! మరో వైపు ఇతర జబ్బులు సైతం ఊపందుకోవటం నెజంగానే బాధాకరం.. జైప్రకాశ్ గొట్టిముక్కల గారి ఆత్మకు శాంతి చేకురాలని ఆశిస్తు
రిప్లయితొలగించండి🙏🙏🙏
రిప్లయితొలగించండిబ్లాగ్ మిత్రులు, మేధావి, సహృదయులు జై గొట్టిముక్కల గారి మరణ వార్త బాధాకరం. వారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు. ఓం శాంతి.🙏🙏👌
రిప్లయితొలగించండిJai గారి ఛాయాచిత్రాలు ప్రచురించిన శ్యామలరావు గారికి కృతజ్ఞతలు.
వారి ఛాయాచిత్రం వారి ప్రొఫైల్ చూసినా అక్కడ కూడా లేదు. వాట్సాప్ ద్వారా వారితో భాషిస్తూ ఉండే వాడిని కాబట్టి వారక్కద ఉంచిన ఫామిలీఫోటోమాత్రం ఉంది. జై గారి కుటుంబాన్ని అభ్యర్ధిస్తే వారు దయతో నేను అడిగిన వివరాలూ వారి ఛాయాచిత్రమూ ఇచ్చారు. వారి అనుమతితోనే నేను ఆ వివరాలు ఫోటోలూ ఈటపాలో ఉంచాను. ఈటపా లింక్ కూడా జై గారి కుటుంబానికి అందించాను. వారి తమ పూర్తిపేరు గుప్తంగా ఉంచారు కాని వారి కుటుంబం అనుమతితో నేను అది వెల్లడించాను.
తొలగించండిబ్లాగ్ మిత్రులు, మేధావి, సహృదయులు జై గొట్టిముక్కల గారి మరణ వార్త బాధాకరం. వారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు. ఓం శాంతి.🙏🙏👌
రిప్లయితొలగించండిJai గారి ఛాయాచిత్రాలు ప్రచురించిన శ్యామలరావు గారికి కృతజ్ఞతలు.
Very sad and shocking news.
రిప్లయితొలగించండిOM Shanti🙏
అయ్యో పాపం!
రిప్లయితొలగించండితెలంగాణను ఇష్టపడటంలో తప్పు లేదు గానీ అంధ్ర నష్టపోవాలని కోరుకోవడం మాత్రం క్షమించరాని దుర్మార్గమే!దాని గురుంచి అతన్ని ద్వేర్షించాను కూడా.అయినప్పటికీ అంధ్రుల మూర్ఖత్వం వల జగను పరిపాలనలో ఆంధ్ర చంకనాకిపోవడం చూశాకనే పోవడం అతని అదృష్టం!
జన్మాంతాని వైరాణి అనుకుని సరిపెట్టుకుంటున్నాను.కాలోహి దురతిక్రమం - స దయితే కురు మే దైవం, సకల పాపాని క్షమయితే, తవ జన్మరాహిత్యం భవేత్.
జై శ్రీ రాం
ఆధునికరాజకీయటక్కటమారవిద్యావీక్షణాదృష్టజన్ముల మని మనం తెలుసుకొనలేకపోతున్నాం కదా అనిపిస్తోంది నిజంగా.
తొలగించండిఆతెలివిడి కలవారు జగన్మోహనమైన పాలన మరొక ముఫ్ఫై యేళ్ళైనా ఉండాలీ అంటున్నారు.
అలాగే చంద్రశేఖర పాహిమాం నీవే ఆదర్శం దేశానికే కాదు ప్రపంచానికే అని దుందుభులు మ్రోయించే వారూ బహుళంగానే ఉన్నారు.
మనలాంటి అమాయకులు మాత్రం యింకా తెలుగునేల రెండుచెక్కలైనదీ ఆరెండూ అప్పులకుప్పలైనవీ అని రాగాలుతీస్తున్నాం!
జైగారు ఉండిఉంటే వారి మేధస్సు ఆవిజయగీతికలే ఎలాగు నిజమో గణాంకాలతో సహా ఏకరువు పెట్టేవారు కదా అని విచారంగా ఉందని ఒప్పుకోవాలి.
కాకపోతే ఈరోజున కేంద్రమూ ప్రజాసంపధలు ప్రైవేటు పరంచేసి అప్పులవేటలో పడింది అంటే అది మన ఉభయపార్శ్వాల ముఖ్యమంత్రులూ చూపుతున్న దారిలోనికి రావటమే కదా. ఆఋజువు చాలదా మనకు.
తెలుగువారి ఘనతలను ఆస్వాదించండీ. పాతపాటలు వదిలి కొత్త మాటలు నేర్చుకోంండి ప్లీజ్.
అయ్యో జై గొట్టిముక్కల గారు స్వర్గస్తులయ్యారని ఈ రోజే తెలిసింది . చాలా బాధాకరం . తెలంగాణ గురించి బ్లాగుల్లో గణాంకాలతో , రేషనల్ గా వాదించే వారు . ఒక ఆంధ్రవాది గా , ఆయన ఇచ్చే సమాచారం కి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను కూడా . ఆయన ఆత్మకి ఆ పరమ శివుడు శాంతిని ప్రసాదించాలి .
రిప్లయితొలగించండిఅవునండీ. శ్రీ గొట్టిముక్కల వారు వీరతెలంగాణా వాది ఐనా చాలా రేషనల్. గణాంకాలతో సహా తనవాదానికి ఎప్పుడు చక్కగా సమర్ధనలు చూపేవారు. కొందరిలా ఆయన తిట్లూ శాపనార్ధాలతో విరుచుకొని పడే బాపతు వ్యక్తి కాదు. ఆయన వాదం ఎప్పుడూ చక్కగా హద్దుల్లోనే ఉండేది. మనం ఆయన వాదంతో ఏకీభవించవచ్చును మానవచ్చును కాని ఆయన సౌమ్యత మాత్రం నిస్సందేహం.
తొలగించండిఆయన సాత్వికుడు, వాదనలో దుర్భాషలు లేకుండా చక్కగా మాట్లాడేవారు. చాలా విషాదకరం. వారికి సద్గతులు కలుగుగాక.
తొలగించండిఇప్పుడే చూసానండీ. బ్లాగులోకంలో ఒకరికొకరం తెలియదు. కానీ బాగా తెలిసినట్లు వాదించుకుంటాం . వ్యాఖ్యలు చేస్తాం ఒకే ఏడాది ముగ్గురు బ్లాగర్లు వేణు శ్రీకాంత్ , వంశి కలుగోట్ల , గొట్టుముక్కల స్వర్గస్తులవ్వటం చాలా బాధగా ఉంది.
రిప్లయితొలగించండిచాలా నిజం అండీ.
తొలగించండి