1, ఆగస్టు 2021, ఆదివారం

విందండీ భలే మంచి విందండీ విందు

విందండీ భలే మంచి విందండీ విందు
విందారగించ రండందరును నేడు

కనుల కెంతో విందు వీని కమనీయరూపము
మన చెవులకు విందు వీని మధురనామము
మనసునకే విందు వీని మహనీయతత్త్వము
వినుడయ్యా రాము డిచ్చు విందండీ విందు

అమృతమే అమృతమే అక్షుల కతని రూపు
అమృతమే అమృతమే  అతని తత్వము
అమృతమే అమృతమే అధరముల కతని పేరు
అమృతమే రాము డిచ్చు హాయైన విందు

కదలిరండి సాటిలేని కమ్మనైన విందిది
మృదుమధురమైన విందు మేదిని పైన
ఇదివరకు లేని విందు ఎంతోగొప్ప విందు
ఇదిగిదిగో రాముడిచ్చు ఇంపైన విందు





2 కామెంట్‌లు:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.