అవలియొడ్డు నకు చేర్చు నందమైన నౌక
భవసాగరమును దాటు బంగరు నౌక
సుజనులే తరచుగా సొచ్చుచుండు నౌక
కుజనులే సంశయించు గొప్పనౌక
ధ్వజమున ఖగరాజుగల విజయనౌక
సజావుగా ప్రయాణించు చక్కనినౌక
రామనామ నౌక భలే రమ్యమైన నౌక
రామభక్తులందరు చేరు రాజనౌక
ప్రేమతోడ హరిపంపిన పెంపగు నౌక
తామసికులు చేరగా తలచని నౌక
ఎక్కువారలను కే విమ్మనదీ నౌక
పెక్కుడు సౌకర్యముల పెద్దనౌక
మిక్కిలిగా భక్తులు ప్రేమించెడు నౌక
చక్కగా కైవల్యపురికి సాగెడు నౌక
ఈ కీర్తన వెరైటీగా folk song లా చాలా బాగుంది 👌👌🙏
రిప్లయితొలగించండినిజమే!
తొలగించండిబృందగానానికి చాలా అనువైనది.పదిమంది కూడిన చోట అందరూ కలిసి ఆడుతూ పాడితే చాలా బాగుంటుంది!
జై శ్రీ రాం!
ధన్యవాదాలు హరిబాబు గారూ.
తొలగించండి