నరుడేమి సంపాదించు ధర మీదను
అదిచదివితి నిదిచదివితి నని పొంగునే కాని
చదివినట్టి చదువులన్ని చదివించిన దెవ్వడు
అదిచదివి యిదిచదివి యార్జించిన ధనముల
కుదురు వాడుపెట్టిన గొప్పభిక్ష కాదో
అది నేర్చితి నిది నేర్చితి నని యార్చునే కాని
అదియు యిదియు నేర్చు నేర్పు నందించిన దెవ్వడు
అదినేర్చి యిదినేర్చి యార్జించిన ధనముల
కుదురు వాడుపెట్టిన గొప్పభిక్ష కాదో
అందులకే హరేరామ హరేకృష్ణ యనవలె
బందీవై యహంబునకు పరమాత్ముని కాదని
తొందరపడి పలికితే దూరమురా మోక్షము
వందనమో హరి యని పొందు మపవర్గమును
కర్తవ్య భోదనా గుర్తు చేసావు చాలా బాగుంది 👌👌
రిప్లయితొలగించండితొందర పడి నడిచితె దూరము రా
రిప్లయితొలగించండిఅని ఉంటే బాగుంటుందని అనుకుంట
... పరమాత్ముని కాదని తొందరపడి పలికితే ...
తొలగించండిఇలా సరిగా అమర్చుకొని చూసితే క్లిష్టత ఏమీ లేదండి.
చాలా చక్కగా చెప్పారు అహం వీడవలెనని 🙏
రిప్లయితొలగించండిబహుకాలదర్శనం. బాగున్నారా? కీర్తన నచ్చినందుకు సంతోషం.
తొలగించండి