7, ఆగస్టు 2021, శనివారం

రావయ్య రారా రామయ్య రారా

రావయ్య రారా రామయ్య రారా
రావయ్య నాభాగ్యరాశివి కద రారా

నాతో పంతాలు నీకు న్యాయమా రారా
నాతప్పు లిపు డెన్నుట న్యాయమా రారా
సీతాసమేత రారా శ్రీరామ రారా
వాతాత్మజాసహిత పరమాత్మ రారా

నాపాలిటి దైవమా నన్నేల రారా
పాపాత్ముడ గాను నీదు భక్తుడను రారా
భూపుత్రీయుత రామభూపాల రారా
కోపమేల రారా గోవింద రారా

కరుణామయ దైవశిఖామణీ రారా
మరలమరల ప్రార్ధింతును మన్నించి రారా
ధరణిజావర రారా దైత్యాంతక రారా
పరమపురుష రారా పాలించ రారా


3 కామెంట్‌లు:

  1. 8 వ లైన్ నీకు అనే చోట needu అని ఉంటే బాగుండేది. 4 వ లైన్ యిప్పు డు యెన్ను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచిసూచన. నిజానికి నీదు అన్నా నీకు అన్నా కూడ బాగానే ఉంటుంది. టైపోను గమనించినందుకు ధన్యవాదాలు. సవరించాను. మొబైల్ మీద టైప్ చేసినపుడు కొంచెం ఎక్కువ గ్లాని వలన టైపోకు అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.