2, ఆగస్టు 2021, సోమవారం

సులభసాధ్యు డితని మరువు సొచ్చియుండుడీ

సులభసాధ్యు డితని మరువు సొచ్చియుండుడీ
కలి కసాధ్యు డితని మరువు సొచ్చియుండుడీ

మంచిరూపు రేఖలవాడు మంచిమాట లాడువాడు 
మంచివారి కెల్లప్పుడు మంచిచేయుచుండువాడు 
మంచిచెడ్డ లెంచిచూచి మంచివరము లిచ్చువాడు
మంచివాడు మీరు వీని మరువుసొచ్చుడీ

కరుణగల చూపువాడు కలుషములను బాపువాడు
సురారులను దునుమువాడు కరకుశరము లున్నవాడు 
పరమసాధుజనుల కెపుడు బలమునిచ్చుచుండు వాడు
మరువకుండ మీరు వీని మరువుసొచ్చుడీ

హరుడు పొగడుచుండు వాడు పరమధర్మముమూర్తి వీడు
ధరాసుతావరుడు వీడు త్రైలోక్యగురుడు వీడు
పరమపదము చేర్చువాడు పట్టాభిరాము డితడు
హరియవతార మీతని మరువుసొచ్చుడీకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.