1, ఆగస్టు 2021, ఆదివారం

శివశివ నీవేమో శ్రీరామ యనమంటే

శివశివ నీవేమో శ్రీరామ యన మంటే
ఎవరూ విననొల్ల రేమయ్యా

ఓం నమః శివాయ యని యుర్విని వీరంతా
జ్ఞానోపార్జనాసక్తి యని
పూని చదువులు వేడ్క మొదలిడుదు రంతే
కాని నీ పలుకులే లోనెంచలేరే

వేదమయుడవు నీవు విశ్వమూర్తివి నీ
వాదిగురుడవు మా బాగెంచి
ఆదరించి రామమంత్ర మందించి చేయు డంటే
మేదిని జను లది లోదలచరే

నేను చేయు మంత్రమిదే నిత్యము మీరును
మానక చేయుడని మహదేవా
జ్ఞానోపదేశమెంత చక్కగ చేసినను
మానవులు మంచి మాటలు వినరే


3 కామెంట్‌లు:

  1. అసక్తి కలవారికోసం ఒక చిన్న విషయం. "శివశివ నీవేమో శ్రీరామ యనమంటే" అన్న్న 1300వ రామకీర్తన.

    రిప్లయితొలగించండి
  2. 1300 కీర్తన చాలా బాగుంది, నిత్యం ఈ కీర్తనలే మాకు శరణం, gr8 ఇన్నీ కీర్తనలు వ్రాయడం ఎవ్వరికీ సాధ్యం కాదు 👏👏🙏🙏👌👌

    రిప్లయితొలగించండి
  3. 1300 కీర్తన చాలా బాగుంది, ధన్యుడివి ఇన్ని కీర్తనలు రాయడం నీకే సాధ్యం, మేము రోజు ఈ కీర్తనలు చదువుతున్నాము 🙏🙏

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.